Begin typing your search above and press return to search.
సీఎం మమతకు కరోనా అంటిస్తానన్నాడు.. వైరస్ సోకింది
By: Tupaki Desk | 2 Oct 2020 5:30 PM GMTపశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలుచేసిన బీజేపీ నేతకు తగిన శాస్తి జరిగింది. తనకు కరోనా సోకితే సీఎం మమతా బెనర్జీని హత్తుకుంటానంటూ ఇటీవల రెచ్చిపోయిన బీజేపీ నేత అనుపమ్ హజ్రాకు తాజాగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన కోల్ కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.
ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శిగా అనుపమ్ హజ్రా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే బెంగాల్ సీఎం మమతపై చెలరేగిపోయారు. ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తూ.. తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతను కౌగిలించుకుంటానంటూ నోరు పారేసుకున్నారు.
ఈ వ్యాఖ్యలకు తథాస్తు అన్నట్టు కరోనా వైరస్ కూడా ఆయనకు సోకింది. దీంతో ఆస్పత్రి పాలయ్యారు. బీజేపీ నేతకు తగిన శాస్తి జరిగిందని తృణమూల్ నేతలు ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.
అయితే మమతపై నోరుజారిన అనుపమ్ పై ఇప్పటికే తృణమూల్ నేతలు డార్జిలింగ్ జిల్లాలోని సిలిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.