Begin typing your search above and press return to search.
భైంసా ఎపిసోడ్ పై బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 19 May 2020 6:00 AM GMTలాక్ డౌన్ కు ముందు నిర్మల్ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవటం.. ఆ తర్వాత ఆ ఉదంతం ఒక కొలిక్కి రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే మరోసారి భైంసా వ్యవహారం వార్తల్లోకి వచ్చింది.అయితే.. అక్కడ జరుగుతునన అంశాల్ని రిపోర్టు చేయాల్సిన మీడియా సరిగా వ్యవహరించటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. భైంసా ఉదంతంలో అరెస్టు అయి జైల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా అదిలాబాద్ కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. తనను కలిసిన బాధితుడితో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. షాకింగ్ అంశాల్ని ప్రస్తావించారు. ఇటీవల భైంసాలో ఏం జరిగిందో ఆయన చెప్పిన మాటల్ని యథాతధంగా తీసుకుంటే.. భైంసాలో హిందువులు.. ముస్లింల మధ్య జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లాక్ డౌన్ లో ఉగాది.. హనుమాన్ జయంతి.. శ్రీరామనవమి.. లాంటి పండుగలు కేవలం ఇళ్లల్లోనే చేసుకున్నారు. అందుకు భిన్నంగా భైంసాలోని ఒక మసీదులో నిబంధనలకు విరుద్ధంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సూచన చేసిన వ్యక్తిపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఎదురుదాడి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా మారింది. హిందువులపైనే కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
గొడవతో సంబంధం లేని సంతోష్ కుమార్ అనే అబ్బాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. కశ్మీర్ లో పండిట్ల మాదిరి.. భైంసా నుంచి హిందువులను పంపించే కుట్ర పథకం ప్రకారం సాగుతుంది. భైంసా ఘటనను మానవహక్కుల సంఘానికి నివేదిస్తాం. హైకోర్టును ఆశ్రయిస్తాం.ఎస్సీ.. డీఎస్పీలను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతాం. డీజీపీకి కంప్లైంట్ చేస్తామని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమని స్పందిస్తుందో చూడాలి.