Begin typing your search above and press return to search.
ధర్మపురి అరవింద్ బీజేపీకి ఎందుకు టార్గెట్ అయ్యాడు..?
By: Tupaki Desk | 29 Aug 2019 5:20 AM GMTనిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీకి ఎందుకు టార్గెట్ అయ్యారు. జాతీయ స్థాయి నేతలతో టచ్ లో ఉండటం వల్లే కొంతమంది నాయకులు ఓర్చుకోలేకపోతున్నారా.. అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తెలంగాణ బీజేపీలో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి.. దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.
పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు కేవలం నిజామాబాద్ కే పరిమితైన ఆయన పేరు. ఇప్పుడు దేశమంతా తెలిసిపోయింది. పార్లమెంట్ లోనూ ఎవరీ ధర్మపురి అరవింద్ అన్న చర్చ జరుగుతోంది. పార్లమెంట్ హాల్లోనూ అరవింద్ ఎవరు? కవితపై విజయం సాధించిన నేత ఎవరూ - అంటూ మిగతా రాష్ట్రాల ఎంపీలు ఆరా తీశారట. పార్లమెంట్ పోరులో ప్రతిష్టాత్మక నిజామాబాద్ విజయంతో - పార్టీకే ఊపు తెచ్చాడని భావిస్తున్న అరవింద్ కు - సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందే - పార్టీలోనే తీవ్ర అవమానం జరిగిందన్న వార్త ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది.
సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు - హైదరాబాద్ లో రాష్ట్ర పార్టీ నాయకత్వం కీలక మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడొకరు నిజామాబాద్ లో అనవసర రాజకీయాలు చేస్తున్నావంటూ - అరవింద్ ను గెట్ అవుట్ అన్నాడట. దీంతో ఒక్కసారిగా తీవ్ర మనోవేదనకు గురైన అరవింద్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన పంచుకున్నారట. ఎన్నికల ముందు జరిగిన ఘటన అయినప్పటికీ - ఢిల్లీలో ఎవరో ఒకరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారట.
అనంతరం ఎన్నికల్లో ముఖ్య మంత్రి కుటుంబాన్ని ఖంగుతినిపించి - నిజామాబాద్ లో విజయం సాధించిన అరవింద్ పై పలువురు నేతలు అక్కసు వెల్లగక్కారట. జాతీయ స్థాయి నేతలతో అరవింద్ టచ్ లో ఉండటం - అదే టైంలో జాతీయ స్థాయి బీజేపీ నేతలంతా అరవింద్ కు అమితమైన ప్రాధాన్యం ఇవ్వడం.. ఇటు సీఎం కేసీఆర్ కుమార్తెగా ఉన్న కల్వకుంట్ల కవితను ఓడించి - దేశవ్యాప్తంగా పేరు సంపాదించడంతో పార్టీలోని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.