Begin typing your search above and press return to search.
విశాఖ మీద జీవీఎల్ ఆశలు...జనాలకు అవి గుర్తుకు వస్తే...?
By: Tupaki Desk | 18 Sep 2022 9:30 AM GMTవిశాఖలో కాస్తో కూస్తో బీజేపీకి బలం ఉంది. ఇది ఒప్పుకోకతప్పదు. మొత్తం సౌతిండియాలోనే బీజేపీ ఉనికిని తొట్టతొలుతగా చాటిందే విశాఖనగరం. 1980లో విశాఖ కార్పోరేషన్ ఏర్పడినపుడు ఫస్ట్ మేయర్ గా గెలిచింది బీజేపీకి చెందిన ఎన్ ఎస్ ఎన్ రెడ్డి. ఆయన్ని గెలిపించుకోవడానికి నాడు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా ఉన్న వాజ్ పేయ్ సాక్షాత్తు విశాఖకు దిగి వచ్చి చాలా రోజుల పాటు మకాం వేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతటి పెద్దాయన వేసిన పునాదులు ఈ రోజుకీ కొన్ని చోట్ల విశాఖలో అలాగే ఉన్నాయి. దాని వల్లనే కార్పోరేషన్ లో బీజేపీ ఈసారి కూడా ఒక మెంబర్ ని సొంతంగా గెలిపించుకుంది.
ఇక విశాఖ ఎంపీ సీటుని 2014లో బీజేపీ నేత హరిబాబు గెలిచారు. విశాఖ ఉత్తరం సీటుని విష్ణు కుమార్ రాజు గెలిచారు. 1999లో విశాఖ వన్ గా నాడు ఉన్న చోట నుంచి హరిబాబు బీజేపీ ఎమ్మెల్యే అయ్యారు. ఇలా బీజేపీకి ఎంతో కొంత పట్టు ఇక్కడ ఉంది. దాంతోనే ఇపుడు రాజ్యసభ మెంబర్ జీవీఎల్ నరసింహారావు విశాఖ వైపు చూస్తున్నారు. ఆయన ఏకంగా క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టి విశాఖకు మకాం మార్చేస్తున్నారు.
విశాఖ సమస్యల మీద తాను పోరాడుతున్నానని ఆయన చెబుతూ కేంద్ర మంత్రులకు తరచూ వినతులు ఇస్తున్నారు. వాటిని తెచ్చి మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, పరోక్షంగా దాని మీద ఆధారపడిన వారు విశాఖలో మూడు నాలుగు నియోజకవర్గాలలో ఉన్నారు.
ఈ రోజుకీ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని బీజేపీ ఎక్కడా చెప్పడంలేదు. పైగా చకచకా ఆ పని పూర్తి చేసే యోచనలో ఉంది. ఇటీవల జీవీఎల్ ఢిల్లీ వెళ్ళి ఉక్కు మంత్రిని కలసి ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయమని కోరారు. దాంతో జ్యోతీరాదిత్య హామీ కూడా ఇచ్చారట. వారికి యాభై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. మరి దీని భావమేంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. ఉక్కు ప్రైవేట్ పరం అయితే అందులో కొత్తగా తీసుకునే వారిలో యాభై శాతం ఇస్తారా లేక వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇస్తారా అన్నది అయితే తెలియదు.
ఏమైనా ఉక్కు ప్రైవేటీకరణ చేయమని మాట చెప్పకుండా ఇలాంటివి ఎన్ని చేసినా బీజేపీకి జనాలు ఓట్లు ఎలా వేస్తారు అన్నదే ఇక్కడ పాయింట్. అలాగే రైల్వే జోన్ విషయం కూడా ఉంది. దీనికి మూడేళ్ళుగా అతీ గతీ లేదు. ఈ విషయంలో కూడా కేంద్రం ఉదాశీనంగా ఉంది. దానికి తోడు విశాఖ నుంచి కొన్ని రైళ్ళు కొత్తగా వేయాలని ఎపుడూ కోరినా కూడా వాటిని పట్టించుకోవడంలేదు అన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకో వైపు పోర్టుని కూడా ప్రైవేట్ పరం చేస్తారు అన్న చర్చ నడుస్తోంది.
అలాగే విశాఖ జిల్లాలోని కేంద్ర విద్యా సంస్థలకు నిధులు ఏమాత్రం విదల్చడంలేదు అన్నది అతి పెద్ద ఫిర్యాదు. కేంద్ర సాయం ఏ విధంగానూ విశాఖ వంటి సిటీకి లేదు అనే జనాలు అంటున్నారు. ఇవన్నీ విశాఖ సమస్యలు అయితే ఎనిమిదేళ్ల బీజేపీ ఏలుబడిలో పెరిగిన ద్రవ్యోల్బనం, అలాగే అధిక ధరలు, గ్యాస్ ధరల పెంపు వంటివి కూడా ప్రభావం చూపుతాయి. ఈ నేపధ్యంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం విభజన సమస్యలు పరిష్కరించకపోవడం, విశాఖ సహా ఉత్తరాంధ్రాలోని వెనకబడిన జిల్లాలకు కేంద్ర సాయం లేకపోవడం వంటివెన్నో ఉన్నాయి.
ఇలా అనేక రకాలైన సమస్యలను పెట్టుకుని జీవీఎల్ బీజేపీ ఎంపీగా విశాఖలో గెలవాలని అనుకుంటున్నారు. పొత్తులు ఉన్నా కూడా బీజేపీ అంటే జనాలు ఓటేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది అయితే తన సామాజిక వర్గం ఓట్లు విశాఖ ఎంపీ సీట్లో ఉన్నాయని, అర్బన్ జనాలు బీజేపీకి సానుకూలంగా ఉంటారని, కేంద్ర సంస్థలు అధికంగా ఉన్నాయని, ఆ ఉద్యోగులతో పాటు ఉత్తరాది నుంచి వచ్చిన వారు ఎక్కువగా విశాఖలో ఉండడం కలసివచ్చే పాయింట్స్ అని జీవీఈల్ లెక్కలేసుకుంటున్నారు.
ఇక రాజకీయంగా ఆయన టీడీపీని పల్లెత్తు మాట అనకుండా వైసీపీని గట్టిగా విమర్శిస్తున్నారు. మొత్తానికి రేపు పొత్తు కుదిరితే టీడీపీ వారు తన అభ్యర్ధిత్వం మెచ్చాలని ఆయన వేస్తున్న ఎత్తులు బాగున్నాయి. కానీ అసలు సమస్య జనాలు అన్నీ మరచి బీజేపీకి ఓటేస్తారా అన్నదే మరి.