Begin typing your search above and press return to search.

విశాఖలో యూపీ సభ...జీవీఎల్ ది మామూలు ప్లాన్ కాదుగా

By:  Tupaki Desk   |   22 Jan 2023 5:30 PM GMT
విశాఖలో యూపీ సభ...జీవీఎల్ ది మామూలు ప్లాన్ కాదుగా
X
విశాఖ అంటే మెట్రో సిటీ. ఇక్కడ ఒక భాష ఒక ప్రాంతం అని కాదు, అందరూ ఉంటారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు విశాఖ వచ్చి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యాపకాలలో సెటిల్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖలో పెద్ద ఎత్తున ఉండడంతో నార్త్ నుంచి వచ్చిన జనాభా ఎక్కువగా ఉంది. దాంతో బీజేపీకి విశాఖలో కొంత పట్టు మొదటి నుంచి ఉంది.

నార్త్ జనాలకు బీజేపీ తెలుసు. వారు పార్లమెంట్ ఎన్నికల్లో అందుకే బీజేపీనే ఎంచుకుంటారు. గతంలో కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించిన వారు ఇపుడు బీజేపీకి టర్న్ అయ్యారు. ఇక విశాఖ నంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బీజేపీ బేస్ ఓటు బ్యాంక్ కి తన వైపునకు తిప్పుకునే ప్లాన్ పక్కాగా వేశారు.

అందుకే గతంలో ఎవరూ చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన చేశారు. జనవరి 22న యూపీ స్టేట్ ఆవిర్భావ సభను ఆయన విశాఖ నడిబొడ్డున నిర్వహించారు. ధూం ధాం గా జరిగిన ఈ సభకు ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీని ముఖ్య అతిధిగా పిలిచారు. ఇండస్ట్రియల్ సెక్టార్ లో నిర్వహించిన ఈ సభకు యూపీ బీహార్ కి చెందిన జనాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ ఇటీవల నిర్వహించిన సమావేశాలకు ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడం ఇదే మొదటిసారి.

ఎక్కడో ఉపాధి కోసం ఏపీకి వచ్చిన వారికి యూపీని గుర్తు చేసి వారి స్టేట్ ఆవిర్భావ నిర్వహిస్తే ఆనందంగా ఉండదా. అందుకే వారంతా వెల్లువలా తరలివచ్చారు. ఇక ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ని చీఫ్ గెస్ట్ గా పిలిచి విశాఖను ఉత్తరాదిగా చేసి పారేశారు. తనకు విశాఖను చూస్తే వారణాసిని చూసినట్లు ఉందని జీవీఎల్ చెప్పడం విశేషం.

విశాఖ వాసులకు లోకల్ గానే ఓటు హక్కు ఉండాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరాను అని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి జీవీఎల్ పోటీ కన్ ఫర్మ్ అలా అయిపోయింది. పొత్తులు ఉన్నా లేకపోయినా బీజేపీ క్యాండిడేట్ ఆయనే అని అంటున్నారు. ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలకు సన్నిహితుడైన జీవీఎల్ విశాఖకు మకాం మార్చి చాలా కాలం అయింది.

ఆయన ఇక్కడే సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. విశాఖ సమస్యల మీద పోరాడుతున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఇతర రాష్ట్రాల వారి జనాభా ఇరవై శాతం పైగా ఉంది. ఇపుడు వారి ఓట్లను గుత్తమొత్తంగా కొల్లగొట్టాలని బీజేపీ పధక రచన చేస్తోంది. లోకల్ పార్టీలకు వారు ఎపుడూ ఓటు వేయరు. వారు ఉత్తరాది పార్టీలనే కోరుకుంటారు. ఆ విధంగా వారిని తమ వైపు తిప్పుకుంటున్న జీవీఎల్ వచ్చే ఎన్నికల కోసం సన్నాహలు మొదలెట్టారు. ప్రతీ ఉత్తరాది వారి వ్యాపార దుకాణాలలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో తప్పనిసరిగా పెట్టుకోవాలని జీవీఎల్ చెప్పడం విశేషం.

ఇవన్నీ చూస్తూంటే జీవీఎల్ బీజేపీ బేస్ ఓట్ల మీద కన్నేశారు అని అర్ధమవుతోంది. ఇక విశాఖలో మేధావులు విద్యార్దులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇతర జిల్లాల వారు సైతం ఉన్నారు. జీవీఎల్ సొంత సామాజికవర్గం ఓట్లు కూడా మంచి సంఖ్యలో ఉన్నాయి. దాంతో జీవీఎల్ విశాఖలో పాగా వేయాలని చూస్తున్నారు.