Begin typing your search above and press return to search.
కవితక్కకు మరో పంచ్ పడింది
By: Tupaki Desk | 5 Sep 2016 10:53 AM GMTరోజులన్నీ మనవి కాదన్నట్లే.. మాటలన్నీ మనవి కాదన్న విషయాన్ని ఎంపీ కవిత మర్చిపోయినట్లున్నారు. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడినా నడిచిపోతుంది. కొన్నిసార్లు అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంది. ఏం మాట్లాడినా పంచ్ ల మీద పంచ్ లు పడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం కవిత పరిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. తెలంగాణ ఉద్యమంలో సైతం ఎప్పుడూ అనిపించుకోనంత దారుణ వ్యాఖ్యలు తాజాగా ఆమె పడుతున్నారు. తెలివిగా మాట్లాడటంలో తనకు తానే సాటి అన్నట్లుగా వ్యవహరించే కవిత నోటి నుంచి వచ్చిన ఒక్క తప్పు మాటతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ రీతిలో విరుచుకుపడ్డారో నిన్న (ఆదివారం) తెలిసిందే.
కొత్త జిల్లాల జాబితాలో గద్వాల్.. పరకాలను కూడా చేర్చాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ చేసిన దీక్షను ఉద్దేశించి కవిత విమర్శలు చేయటం.. ఇందులో భాగంగా డీకే అరుణను ‘బొమ్మాళి’గా వ్యాఖ్యానించటం తెలిసిందే. నేను బొమ్మాళి అయితే.. మీ నాన్న పశుపతా? అంటూ డీకే అరుణ ఘాటుగా రియాక్ట్ అయితే.. కేసీఆర్ అన్న కుమార్తె రమ్య అయితే ఏకంగా కవితను తాటకిగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవితక్క విమర్శలు చేయటమే కాదు ఎదురు అనిపించుకోవటం అన్నది ఉండదు. తాజా ఎపిసోడ్ లో దీనికి భిన్నమైన పరిస్థితిని ఆమె ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా కవిత స్పందించి.. కమలనాథుల మీద కస్సు మన్నారు. విమోచన దినోత్సవాలు లాంటివి హిందూ.. ముస్లింల మధ్య అంతరాలు పెరుగుతాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పారని.. కవిత ఆ విషయాన్ని మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు మీ నాయన తొడగొట్టి చెప్పిండు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని’’ అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే హిందూ.. ముస్లింల మధ్య గొడవలొస్తాయని కవిత పేర్కొనటం సరికాదన్నారు. విమోచన దినోత్సవాన్ని నిజాం స్టేట్ లో భాగమైన కర్ణాటక.. మహారాష్ట్రలు ఇప్పటికే నిర్వహిస్తున్న విషయాన్ని కవితకు తెలుసా? అన్నది ఒక ప్రశ్న. ఆ రాష్ట్రాల్లో రాని గొడవలు.. తెలంగాణలో ఎందుకు వస్తాయి? అన్నది మరో ప్రశ్న. విషయాల మీద పూర్తి అవగాహన లేకుండా తొందరపడి మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయన్న విషయాన్ని కవిత గుర్తిస్తే బాగుంటుందేమో. లేకుంటే.. ఆమె మరిన్ని విమర్శలు ఎదుర్కొవటానికి సిద్దంగా ఉండాల్సిందే.