Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను..కమ్యూనిస్ట్ ల్ని ఒకేసారి ఏసుకున్నాడు
By: Tupaki Desk | 3 Sep 2016 7:22 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించినా.. రావాల్సినంత మైలేజీని రాని రాజకీయ పార్టీల్లో బీజేపీ ముందుంటుంది. అప్పుడెప్పుడో ఒక్క ఓటు రెండు రాష్ట్రాలన్న నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చినా.. దాన్ని ఉద్యమంగా మార్చటంలో బీజేపీ సక్సెస్ కాలేదనే చెప్పాలి. బీజేపీ నినాదాన్ని తనదైన శైలిలో ఉద్యమంగా మార్చిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర జాతిపితగా అవతరించారని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి మాత్రమే దక్కే అవకాశాన్ని మిస్ చేసుకున్న బీజేపీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో తన బలాన్ని పెంచుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ ఆ పార్టీకి అనుకున్నది సాధించలేకపోతోంది.
ఇదిలా ఉంటే.. రానున్న మూడేళ్ల వ్యవధిలో అయినా తెలంగాణలో తన బలాన్ని వీలైనంత భారీగా పెంచుకోవాలని తపిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు ‘‘సెప్టెంబరు 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం’’పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ పోగొట్టుకునే అవకాశం ఉండటంతో ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారపక్షం చప్పుడు చేయని పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవంపై హడావుడి చేసిన టీఆర్ ఎస్ పార్టీ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం చప్పుడు చేయకుండా ఉండిపోయింది. విమోచనదినోత్సవం గురించి ఏ మాత్రం హడావుడి చేసినా మిత్రుడు మజ్లిస్ తో లెక్కలు తేడా రావటమే కాదు.. మైనార్టీ ఓటు బ్యాంక్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్న లెక్కలతో గులాబీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఇదే అవకాశంగా భావిస్తున్న కమలనాథులు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచనలో కీలకభూమిక పోషించినట్లు ప్రచారం చేసుకునే కమ్యూనిస్టుల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు. పనిలోపనిగా కమ్యూనిస్టులతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ ల పాత్ర చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ సీనియర్ ఇంద్రసేనారెడ్డి. కమ్యూనిస్టులు ఒకదశ వరకూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని.. ఆ తర్వాత వారితో కలిసిపోయారన్నారు. 1948 తర్వాత హైదరాబాద్ విడిగా ఉంటే కమ్యూనిస్టు రాజ్యం వస్తుందన్న ఆశతో నిజాంతో కలిసిపోయారంటూ ఆరోపించిన ఇంద్రసేన.. కమ్యూనిస్ట్ రాజ్యం వస్తుందని భారత్ కు వ్యతిరేకంగా పోరాడారంటూ చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టులకు రజాకార్లతోనూ.. నిజాంతోనూ సంబంధాలు ఉండేవంటూ ఒళ్లు మండిపోయే మాటను చెప్పిన ఇంద్రసేన మరో విషయాన్ని గుర్తు చేశారు.
భారత్ లోని చాలా భాగాల్లో కమ్యూనిస్టుల మీద నిషేధం ఉంటే.. హైదరాబాద్ లో మాత్రం వారికి అనుకూలంగా నిజాం నిషేధాన్ని ఎత్తి వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టులపై ఓ రేంజ్లో విరుచుకుపడిన ఇంద్రసేన.. కేసీఆర్ మీదా మండిపడ్డారు. గతంలో సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని జబ్బలు చరుచుకున్నకేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాన్ని నిర్వహించకుండా ఉండటం క్షమించరాని పాపంగా అభివర్ణించారు. నిజాం సమాధికి సలామ్ కొట్టి కీర్తిస్తున్న కేసీఆర్.. నాడు రజాకార్లు తెలంగాణ ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించిన కన్నీటి గాథ తెలియవా? అంటూ నిలదీశారు. ఇలా.. కమ్యూనిస్టులను.. కేసీఆర్ ను ఓకే వేదిక మీద దుమ్ము దులిపిన ఇంద్రసేనపై ఎర్రదండు.. గులాబీ దండు ఎలా స్పందిస్తుందో..?