Begin typing your search above and press return to search.
హరిబాబు జెనివాలో..బీజేపీ అధ్యక్షుడిని మార్చేస్తున్నారా?
By: Tupaki Desk | 30 March 2018 5:29 PM GMTగత కొంతకాలంగా ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ ఎలాగైనా సరే తమ పునాదులును బలోపేతం చేసుకునేందుకు దృష్టిని సారించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు డా.కంభంపాటి హరిబాబు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. అందుకే రాంమాధవ్ లాంటి కీలకనేతను ఏపీకి పంపించిందని కొందరి భావన. అధికార తెలుగుదేవం పార్టీ నేతలకు తగిన రీతిలో హరిబాబు స్పందించడం లేదంటున్నారు.
ఇదే సందర్భంలో కంభంపాటి హరిబాబు జెనీవా వెళ్లారు. "ఇంటర్ పార్లమెంటరీ యూనియన్" సమావేశాలకి హాజరు కావడానికి ఆయన వెళ్లారని సన్నిహిత వర్గాల సమాచారం. భారత పార్లమెంటరీ బృందంలో సభ్యులుగా ఆయన ఈ పర్యటనకు హారయ్యారని చెప్తున్నారు. అయితే ఈ టూరు వెనుక కేవలం ఎంపీ అనే కోణమే కాకుండా...క్షేత్రస్థాయిలో ఉన్న ఒత్తిళ్లు, వాటి నుంచి ఉపశమనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
మరోవైపు ఏపీ రాజకీయాలను గమనించిన వారి మాట ప్రకారం రాష్ట్ర బీజేపీ ముఖ్యనాయకుల్లో రెండుగా చీలిక ఉందని, అందులో భాగంగా హరిబాబుపై పార్టీ పెద్దలకు అసంతృప్తి ఉందంటున్నారు. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు... అంతర్గత ఆదిపత్యపోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ - కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరి వంటివారు వ్యతిరేక వర్గమని విశ్లేషిస్తున్నారు. ఈ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటున్నారని,. కానీ హరిబాబు ఇతర నేతల స్థాయిలో దూకుడును ప్రదర్శించడం లేదని కొందరు చెప్తున్నారు.