Begin typing your search above and press return to search.
అందుకే...రాజగోపాల్ మాజీ అయ్యాడు...
By: Tupaki Desk | 7 Nov 2022 3:30 AM GMTపెరుగుట విరుగుట కొరకే అని ఒక ముతక సామెత ఉంది. అలగే విజయం నెత్తిన కూర్చుంటుంది అని మరో బండ సామెత కూడా ఉంది. అతి కి పోతే ఇంతే అని కూడా చెప్పాలేమో. ఇవన్నీ కూడా తెలంగాణా బీజేపీకే వర్తిస్తాయి. దుబ్బాకలో రెండేళ్ల క్రితం టీయారెస్ కి దెబ్బ కొట్టారు. అలాగే గత ఏడాది హుజూరాబాద్ తో కొట్టారు. ఆ రెండూ చూసిన వారు అంటే రేపటి రోజు కమలానిదే అనుకున్నారు. ఆ విధమైన వాతావరణం జనంలో క్రియేట్ అయి ఉండగా మునుగోడుని అనవసరంగా కెలికి మొత్తం లేకుండా ఏమీ కాకుండా చేసుకున్నారన్నది బీజేపీ మీద ఒక కరడు కట్టిన విశ్లేషణ.
నిజానికి మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనంలో మూడేళ్లుగా పెద్దగా లేరు అని అంటున్నారు. పైగా ఆయన విపక్షంలో ఉన్నారు. ఏ డెవలప్మెంట్ చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పాటుగా ఆయన సడెన్ రాజీనామాకు అర్ధం పర్ధం అన్నవి లేకుండా పోయాయి. ఒక రాజీనామా చేస్తే దాని వెనక భావోద్వేగం ఉండాలి. తెలంగాణా సాధన కోసం టీయారెస్ ఎన్నో సార్లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు తెచ్చింది. జనాలు ఆ ఎమోషన్స్ కి కట్టుబడి ఓట్లేస్తూ గెలిపించుకుంటూ వచ్చారు.
కానీ కోమటిరెడ్డి రాజీనామాకు ఆ కధ ఏమీ లేదు. పైగా ఆయన చేసిన మరో తప్పు ఎన్నికలు ఏడాది వ్యవధిలో ఉండగా రాజీనామా చేయడం. అంటే నాలుగేళ్ల పాటు తన నియోజకవర్గంలో అభివృద్ధిని టీయారెస్ చేయలేదు అంటే గమ్మున ఊరుకుని ఉన్నారనేగా అర్ధం. ఇక అలంటి ఆరోపణలు చేయాలంటే అదేదో 2023లో జరిగే ఎన్నికల్లోనే జనంలో పెట్టి తేల్చుకుంటే పోయేది కదా. కానీ ఆయన ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజీనామా చేయడమే జనాలకు మండింది అని అంటున్నారు. అకారణమైన రాజీనామా అని కూడా భావించారు అని తెలుస్తోంది.
ఇంకోవైపు చూస్తే మునుగోడులో బీజేపీకి పెద్ద బలం లేదు. అలాంటి పార్టీలో చేరి ఆయన ఒంటరి పోరాటం చేయడం వల్ల కూడా ఓడారు అని అంటున్నారు. ఇక్కడ కోమటిరెడ్డి బలమే తప్ప బీజేపీకి పెద్దగా ఏమీ లేదని తేలిపోయిన వేళ అది దుస్సాహసం అయింది. మరో వైపు టీయారెస్ రెండు సార్లు గెలిచి మూడవసారి విజయం కోసం తన ప్రయత్నాల్లో తాను ఉంది. ఈ మధ్యలో వచ్చిన వరస ఉప ఎన్నికల్లో ఓటములతో పార్టీ కొంత డల్ అయింది. క్యాడర్ కూడా ఏమో ఏమి జరుగుతుందోఅన్న కంగారు లో ఉన్నారు.
అలాంటి వేళన పిలిచి మరీ విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన ఘనత బీజేపీదే అంటే అది పక్కాగా తప్పు చేసినట్లే కదా. మరో వైపు ఉప ఎన్నిక కోసం టీయారెస్ తన మందీ మార్భలాన్ని ఎందుకు మోహరించదని బీజేపీ భావించిందో అర్ధం కాదు. అలాగే కాంగ్రెస్ కి బలమున్న సీట్లో ఆ పార్టీ కూడా తన వంతు వాటా ఎంతో కొంత తీసుకోకుండా ఎలా ఉంటుందని ఊహించి ఉందో కూడా తెలియదు. మొత్తానికి రాంగ్ టైం లో రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి మాజీ అయ్యాడు. అదే టైం లో టీయారెస్ హ్యాట్రిక్ విజయానికి బీజేపీ కొండంత బూస్టింగ్ ఇచ్చి తనను తాను బాగా తగ్గించేసుకుంది. ఇదే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చెప్పే సారాంశం.