Begin typing your search above and press return to search.
కేసీఆర్ దుబారా మామూలుగా లేదంట
By: Tupaki Desk | 18 Oct 2016 6:27 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ముప్పేట దాడి మొదలుపెట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ క్షేత్రస్థాయి పోరాటాలతో పాటు రాజ్యాంగబద్ద వ్యవస్థల్లో సర్కారు తీరుపై ఫిర్యాదు చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత సచివాలయం భవనాలను కూల్చేసి కొత్త సెక్రటేరియట్ - కొత్తగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించేందుకు 350 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ వేస్తున్న ఈ అడుగు దుబారా కింద తేల్చిన బీజేపీ ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంత సేపు సొంత కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. తమ సొంత అవసరాల కోసం కోట్లు ఖర్చు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల - పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర ప్రభుత్వ శాఖలు అమరావతికి తరలి వెళ్ళిన తర్వాత చాలా భవనాలు మిగిలిపోతాయని, వాటిని మరమ్మతులు చేయించుకుని ఉపయోగించుకోవాలే తప్ప అనవసరమైన ఖర్చు చేయరాదని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అధ్వాన్నంగా మారిన రోడ్లను బాగు చేయించే అంశంపై దృష్టి సారించాలని కృష్ణసాగర్ రావు చెప్పారు. కరవు మండలాల గురించి కేంద్రానికి నివేదించి సహాయం కోరలేదని, పరువు పోతుందేమోనని భావిస్తున్నట్లున్నారని తెలిపారు. కరవు నివారణకు కేంద్రం విడుదల చేసిన 791 కోట్ల రూపాయలను వివిధ పథకాలకు మళ్లించారని కృష్ణసాగర్ రావు విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/