Begin typing your search above and press return to search.

ఆర్ ఎస్ ఎస్ లో లేనిది చెప్పిన అద్వానీ

By:  Tupaki Desk   |   16 Jan 2017 4:33 AM GMT
ఆర్ ఎస్ ఎస్ లో లేనిది చెప్పిన అద్వానీ
X
బీజేపీ కురువృద్ధుడిగా సుపరిచితులైన అద్వానీ ఆసక్తికర అంశాన్ని చెప్పారు. ఆయనకు.. రాష్ట్రయ స్వయం సేవక్ కు మధ్యనున్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సంఘ్ పరివార్ తో విడదీయరాని అనుబంధం ఉన్న అద్వానీ.. ఆ సంస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆర్ ఎస్ ఎస్ లోపాల్ని ఎత్తి చూపేలా ఉండటం గమనార్హం.

ప్రముఖ అధ్యాత్మిక సంస్థ అయిన ప్రజాపిత బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అద్వానీ.. ఆ సంస్థపై పొగడ్తల వర్షం కురిపించారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాపిత బ్రహ్మకుమారీల సంస్థను ప్రస్తావిస్తూ.. ఆర్ ఎస్ ఎస్ లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని అద్వానీ ప్రస్తావించారు. సంఘ్ తో తనకున్న అనుబంధాన్ని చెబుతూనే.. ఆ సంస్థలో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలని చెప్పారు.

ఎన్నో ఏళ్లుగా తాను సంఘ్ లో పరి చేశానని.. ఆ సంస్థతో తనకున్న అనుబంధం చాలా ఎక్కువన్న అద్వానీ.. ‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ.. వారు ప్రజాపిత బ్రహ్మకుమారీల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ విషయాన్ని నేను కలిసిన ప్రతిఒక్కరికి ప్రత్యేకంగా చెబుతుంటా. నా చిన్నతనంలో ఆర్ ఎస్ ఎస్ లో అబ్బాయిలే ఎక్కువగా చేరుతుండేవారు. సంఘ్ లో చేరు బాలికల సంఖ్య చాలా తక్కువ. సంఘ్ లో ఇప్పటికైనా మహిళల ప్రాతినిధ్యం పెంచాలి’’ అని సూచించారు. నిత్యం సలహాలు ఇచ్చే సంఘ్ కే అద్వానీ ఇచ్చిన సలహా మీద ఎలా రియాక్ట్ అవుతారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/