Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ పై బీజేపీ నాయకురాలు సంచలన వ్యాఖ్యలు..
By: Tupaki Desk | 1 Oct 2021 4:24 PM GMTపవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి మరియు మంత్రుల మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోసాని తన భార్య మీద పవన్ అభిమానులు అసభ్యకరమైన కామెంట్స్ చేసారంటూ దూషణలకు దిగారు. అదే సమయంలో పోసాని.. పంజాబీ అమ్మాయిని తెర మీదకు తీసుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఆ పంజాబీ అమ్మాయిని నమ్మించి మోసం చేసి కడుపు చేసాడని.. అబార్షన్ చేయించుకోకపోతే చంపేస్తామనిని బెదిరించి ఐదు కోట్లు ఇచ్చి సెటిల్ చేశారని పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేసారు. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మీద పోసాని చేసిన ఆరోపణలు నిజమే అని బీజేపీ నాయకురాలు, ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి చెప్పారు.
భారతీయ జనతా పార్టీకి జనసేన మిత్రపక్షం అయినా గాని ఒక మహిళకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తానని అన్నారు. వాస్తవాలను బయట పెడుతుంటే పవన్ అభిమానులు యధావిధిగా పొడిచేస్తాం చంపేస్తాం నరికేస్తాం అంటూ ప్రశ్నించేవారి నోరు మూయించాలని చూస్తున్నారని.. ఎంతమందిని చంపుతారని ఆమె ప్రశ్నించారు. పూనమ్ కౌర్ ఇష్యూ గురించి ప్రతీ తెలుగు వాడికి తెలుసని శ్వేతా అన్నారు.
''పూనమ్ ను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఆమె ఇప్పుడు ఎటూ కాకుండా పోయిందని అందరికీ తెలుసు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పూనమ్ కౌర్ మాట్లాడిన ఆడియోలో మహిళా సాధికారిక గురించి మాట్లాడే వ్యక్తి తనకు ఏమి న్యాయం చేసాడని ప్రశ్నించింది. పవన్ మీద ఏదైనా కామెంట్ చేస్తే విరుచుకుపడే ఈ పిల్లబిత్తిరి బ్యాచ్ ని అడుగుతున్నా.. పూనమ్ కౌర్ ఒకవేళ మీ అక్కో చెల్లో మీ ఇంట్లో మనిషి అయితే మీరు ప్రశ్నించరా? అమ్మాయి జీవితంతో ఆడుకున్న వ్యక్తి.. పవన్ కళ్యాణ్ కావచ్చు.. ఎవరైనా కావచ్చు.. అప్పుడు గల్లా పట్టుకొని మీరు ప్రశ్నిస్తారా లేదా అన్నీ మూసుకొని కూర్చుంటారా?. మీరు నిజంగా చదువుకున్న వారు అయితే సమాజం గురించి అవగాహన ఉన్నవారు అయితే దిమాక్ పెట్టి ఆలోచించండి. పూనమ్ కౌర్ మీ ఇంటి ఆడపడుచు అయితే ఎలా రియాక్ట్ అవుతారో పోసాని కృష్ణ మురళి కూడా అలానే రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో నా సపోర్ట్ పోసాని గారికే.'' అని శ్వేతా అన్నారు.
మరో ఇంటర్వ్యూలో శ్వేతా మాట్లాడుతూ.. పోసాని కృష్ణ మురళి భార్య పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టే.. ఆయన రెండో ప్రెస్ మీట్ లో అలా మాట్లాడారని.. భార్య ను అంటే ఏ భర్తా సైలెంట్ గా ఉండరని.. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కు విలువిచ్చే ఏ మగాడైనా అలానే రియాక్ట్ అవుతారని అన్నారు. పూనమ్ కౌర్ కు నిజంగా ఎలాంటి అన్యాయం జరగకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. పవన్ కు తనకు సంబంధం లేదని.. తనకు కడుపు చేయలేదని.. అబార్షన్ అవలేదని.. డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేయలేదని పూనమ్ కౌర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
''సెన్సిటివ్ మ్యాటర్స్ వాటికి ఆధారాలు ఉన్నాయా? అంటే వాళ్లిద్దరూ ఏదో చేసుకుంటే ఆ టైంలో వెళ్లి వీడియోలు ఎవరు తీస్తారు? ఆధారాలు ఎక్కడ నుంచి వస్తాయి. ఇట్స్ ఎమోషన్.. ఇది అన్యాయం.. కరెంట్ కి ప్రూఫ్ చూపించండి అంటే వైర్ పట్టుకోవాలి. ఇది కూడా అంతే. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా పూనమ్ కౌర్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నారు. టీవీ, సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి లేడీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు.. అతని పేర్లు శరీరంపై టాటూలు కూడా వేసుకుంటున్నారు. మరి వాళ్ల పేర్ల ఎందుకు పైకి రాలేదు?. పవన్ కళ్యాణ్ కి నాలుగు కాదు.. పదో భార్యగా ఉండటానికి కూడా రెడీ అనే వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల పేర్లు పైకి రాకుండా పూనమ్ కౌర్ పేరు మాత్రమే ఎందుకు పైకి వచ్చింది. విషయం జరిగిందని అది నిజం అని అందరికీ తెలుసు'' అని శ్వేతారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.