Begin typing your search above and press return to search.
బీజేపీకి షాక్: టీఆర్ఎస్ లోకి ఆ మాజీ మంత్రి
By: Tupaki Desk | 29 Jun 2021 9:30 AM GMTబీజేపీలో చేరినప్పుడు ఉన్న ఉత్సాహం.. చేరాక పరిస్థితులు చూశాక ఉండడం లేదా? ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని నేతలు నిరుత్సాహంగా ఉన్నారా? తమ ఆదరణ ఇవ్వని పార్టీని వదిలి వేరే వైపు చూస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దశాబ్ధాలుగా రాజకీయం చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు టీడీపీని కాలదన్ని బీజేపీలో చేరారు. చేరినప్పుడు ఉత్సాహంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు లేరు. తాజాగా బీజేపీ వద్దంటున్నా కేసీఆర్ పెట్టిన ‘దళిత నాయకుల సమావేశానికి హాజరయ్యారు’. గులాబీ పార్టీపై ప్రేమ చూపించారు.
బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దళిత సమావేశానికి హాజరైన మోత్కుపల్లి తాజాగా కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. పార్టీ ఆదేశించినా కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి వెళ్లిన మోత్కుపల్లిపై బీజేపీ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది. అధికార టీఆర్ఎస్ నుంచి కూడా నేతలను లాగేసేలా కనిపిస్తోంది. కానీ బీజేపీలో ఉన్న సీనియర్ నేతను మాత్రం కాపాడుకోలేకపోతోంది. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లలో ప్రజాబలం ఉన్న నేతలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే ఆ పార్టీలోని సీనియర్ నేత మోత్కుపల్లి టీఆర్ఎస్ కు దగ్గర కావడాన్ని కమలదళం జీర్ణించుకోవడం లేదు.
ఈటల రాజేందర్ బాటలో మరికొందరు నేతలను టీఆర్ఎస్ నుంచి లాగడానికి బీజేపీ స్కెచ్ గీసింది. కానీ మోత్కుపల్లి వ్యవహారంతో ఇప్పుడు బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది. బీజేపీ తరుఫున తాను వెళ్లి మంచి పనిచేశానని.. లేకుంటే బీజేపీపై ‘యాంటీ దళిత’ ముద్ర పడేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించి ఆ వర్గాన్ని కమలం పార్టీకి దూరం చేసేలా మాట్లాడడం ఆ పార్టీని ఇరుకునపెట్టినట్టైంది.
దీన్ని బీజేపీలో మోత్కుపల్లి అసంతృప్తిగా ఉన్నాడని అర్థమవుతోంది. కారణం చూసుకొని టీఆర్ఎస్ లోకి రావడానికి యోచిస్తున్నాడని.. కేసీఆర్ ఒకే అంటే పార్టీలో చేరవచ్చని అంటున్నారు. ఈ పరిణామంతో మోత్కుపల్లిని బీజేపీ దూరం పెట్టే చాన్స్ ఉంది. మోత్కుపల్లి వ్యవహారంలో మరి ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.