Begin typing your search above and press return to search.
పీఎం పీఠంపై గడ్కరీ..బీజేపీ లెక్కలు వేరేనా?
By: Tupaki Desk | 24 Dec 2018 4:51 PM GMTమహారాష్ట్రలోని ప్రభుత్వ సంస్థ అధికారి ఒకరు రానున్న ఎన్నికల్లో గెలవాలంటే భారతీయ జనతా పార్టీని రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరి నడిపించాలని ఆర్ ఎస్ ఎస్ కు లేఖ రాశారు. మోడీతో ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉండదని - గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థుల రేసులో తన పేరు ఉండటాన్ని గడ్కరి తోసిపుచ్చారు. ఆ ఛాన్సే లేదని ఓ ఇంటర్యూలో ఆయన సమాధానమిచ్చారు. దీనికి వెనుక లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు.
ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బాధ్యతల్లోనే సంతోషంగా ఉన్నానని చెప్పారు.' నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మొదట గంగానది పనులు - 13-14 దేశాలను అనుసంధానిస్తూ ఎక్స్ ప్రెస్ హైవే పనులు చేపట్టాల్సి ఉందని, ఛార్ థామ్ కు రోడ్డు - ఇతర పనులు ఉన్నాయని' అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని మరిచారన్న ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో రూ.9533 కోట్ల వ్యయంతో అరుణాచల్ ప్రదేశ్ లో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.4000 కోట్లతో 400 కిమీ రోడ్డు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. సరైన రోడ్లు లేకపోవడం వల్ల అరుణాచల్ ప్రదేశ్ లో పేదరికం - నిరుద్యోగం ఏర్పడిందని రోడ్ల నిర్మాణం తర్వాత ఈ ప్రాంతంలో అటవీ ఆధారిత పరిశ్రమలు వచ్చి ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు.
అయితే, ఇంత సుదీర్ఘంగా గడ్కరీ వివరణ ఇవ్వడం వెనుక నష్ట నివారణ చర్యలే కారణమని తెలుస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు ఓటమికి కూడా బాధ్యత వహించాలి అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలకు దీనికి లింక్ పెట్టి గడ్కరీయే సరైన ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించినట్లు సమాచారం.