Begin typing your search above and press return to search.
ప్రియాంకపై నోరుజారిన బీజేపీ నేతలు
By: Tupaki Desk | 3 April 2019 11:06 AM GMTఎన్నికల వేళ బీజేపీ నేతల రోత బయటపడుతోంది. మహిళా అని కూడా చూడకుండా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఉద్దేశించి వారు చేస్తున్న లైంగిక వేధింపుల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు కట్టుదాటుతున్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించడం మాని.. వ్యక్తిగతంగా - లైంగికంగా విమర్శించడం ఎక్కువవుతోంది. ఉత్తరభారతంలో ఎన్నికల ప్రచారంలో నాయకులు విచక్షణ కోల్పోయి చేస్తున్న నోటి దురుసు వ్యాఖ్యలు మహిళా నేతలను తీవ్రంగా మానసిక వేధనకు గురిచేస్తున్నాయి. ప్రియాంక గాంధీ యూపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యర్థి బీజేపీ ఇతర పార్టీల నుంచి ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకుడు జయకరన్ - కాంగ్రెస్ నేత - యూపీ ఈస్ట్ ఇన్ చార్జి అయిన ప్రియాంకా గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేశారు. ‘లంగా ధరించి ఇప్పుడు చీరలు ధరిస్తున్న నేత - గంగా జలాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు గంగను విజిట్ చేస్తున్నా’రంటూ ప్రియాంకగాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా ఇరుకునపడింది.
ఇప్పటికే బీజేపీ యూపీ నాయకుడు హరీష్ ద్వివేది ప్రియాంకపై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రియాంక ఢిల్లీలీ టాప్స్, జీన్స్ వేసుకుంటారని.. గ్రామాల్లోకి పచ్చ చీర - బొట్టుతో వస్తారని ఎద్దేవా చేశారు. ఆ మంటలు చల్లారకముందే మరో బీజేపీ నేత నోరాజారాడు.
ఇక బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ కైలాష్ విజయ వార్గియా కూడా ప్రియాంక గాంధీని ఉద్దేశించి ‘చాక్లెట్ ఫేస్’ అంటూ లైంగిక పరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇలా ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల పరుష వ్యాఖ్యలు ఆ పార్టీకి పుట్టిముంచేలా ప్రియాంక - కాంగ్రెస్ పై సానుభూతి వెల్లువెత్తేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్య భారతంలో ఇలా నేతలే తోటి మహిళా నేతలపై నోరుపారేసుకోవడం కలవరపెడుతోంది.