Begin typing your search above and press return to search.
తప్పుదోవ పట్టిస్తున్నారట..పురందేశ్వరి బాధ!
By: Tupaki Desk | 27 Jun 2019 5:24 PM GMTప్రత్యేక హోదా కావాలని అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు బీజేపీ నేత పురందేశ్వరి. గతంలో తెలుగుదేశం పార్టీ అలానే చేసిందని, అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని ఈమె చెప్పుకు రావడం విశేషం! అందుకే జగన్ మోహన్ రెడ్డి హోదా అడగకూడదని.. కేంద్రం ఇచ్చింది తీసుకుని కామ్ అయిపోవాలని పురందేశ్వరి ఉచిత సలహా ఇచ్చారు.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ప్రత్యేకహోదా కావాలి అన్నందుకే అన్నట్టుగా ఈమె చెప్పుకురావడం విశేషం. ఏపీలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎందుకో ఓడించారనే అంశం గురించి ఈమె ఇలా కొత్త భాష్యం చెబుతూ ఉన్నారు. హోదా విషయంలో మాటలు మార్చి - గత్తరబిత్తర చేయడం కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం. హోదా విషయంలో టీడీపీ పదే పదే మాటలు మార్చింది.
ఏపీ ప్రజలు చిత్తు కింద కొట్టింది తెలుగుదేశాన్నే కాదు, బీజేపీని కూడా. హోదా ఇవ్వని బీజేపీని ప్రజలు ఏమీ నెత్తిన పెట్టుకోలేదు! ఆ విషయాలన్నింటినీ పురందేశ్వరి ప్రస్తావించడం లేదు.
తెలుగుదేశం ఓటమి ప్రత్యేకహోదా కావాలని అన్నందుకే అంటూ ఈమె జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నారు. అలా అంటే.. హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉంది. అలాంటి పార్టీని ఏపీ ప్రజలు అలా ఎలా గెలిపించారో పురందేశ్వరే చెప్పాలి!