Begin typing your search above and press return to search.

ఫేక్ పోస్ట్ షేర్ చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి.. వైరల్

By:  Tupaki Desk   |   6 Oct 2021 7:24 AM GMT
ఫేక్ పోస్ట్ షేర్ చేసిన బీజేపీ నేత పురంధేశ్వరి.. వైరల్
X
బీజేపీ నాయకులు, కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి ఏపీ సీఎం జగన్ గురించి చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ ఫేక్ పోస్టును షేర్ చేసి వైసీపీ నేతల ఆగ్రహానికి ఆమె గురవుతున్నారు. సాక్షి మీడియాను, వైసీపీని ఇందులోకి లాగడంతో వారు ఇప్పుడు పురంధేశ్వరికి లీగల్ నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఒక ఆటో వెనుక అంటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో నుంచి బూడిద రాలుతోందని.. ఇది జగన్ మహిమే అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఒక ఫేక్ పోస్టును సృష్టించారు. దీన్ని సాక్షి వెబ్ సైట్ పోస్టు చేసినట్టు సాక్షి లోగోను వాడి మార్ఫింగ్ చేశారు.ఇది నిజమో.. కాదో నిర్ధారించుకోకుండా పురంధేశ్వరి ఆ ఫేస్ పోస్టును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పైగా ‘వైసీపీ అధికారంలోకి వచ్చాక మనకు బూడిదే మిగిలింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అయితే అసలు సంగతి వేరే ఉందని తెలిసింది. ఆటో వెనుక అతికించిన సీఎం వైఎస్ జగన్ చిత్రం నుంచి ఎక్కడ బూడిద రాలడం లేదని.. ఎవరో కావాలనే అభాసుపాలు చేసేలా మార్ఫింగ్ చేశారని తెలిసింది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ‘సాక్షి’ లోగోతో ఈ ఫేక్ పోస్టును సృష్టించారు. అయితే దీన్ని నిర్ధారించుకోకుండా పురంధేశ్వరి ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది.

దీనిపై సాక్షి మీడియా, వైసీపీ నేతలు భగ్గుమన్నట్టు సమాచారం. సాక్షిలో ఇలాంటి వార్త ప్రచురించలేదని.. దీన్ని దగ్గుబాటు పురందేశ్వరి నిర్ధారించుకోకుండానే ఆ ఫేక్ పోస్ట్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు వారు రెడీ అయినట్లు సమాచారం.