Begin typing your search above and press return to search.
శివాజీని విచారణ చేయండి:పైడికొండల
By: Tupaki Desk | 26 Oct 2018 2:21 PM GMTవైసీపీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనను పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఘటనపై టీడీపీ నేతలు మాత్రం...అర్ధం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై దాడి ఘటన వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి - బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు బయట తిగరాలంటే భయపడాల్సిన పరిస్థితులను కల్పించారని ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా చేసి, వచ్చే ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటున్నారన్నారు. జగన్ పై ఆయన అభిమాని దాడి చేశాడని - చిన్న గాయమేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్ని తప్పు దోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ఈ దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
`ఆపరేషన్ గరుడ` అని నటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే...అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరపాలన్నారు. ఏపీలో ఏం జరిగినా...ఆపరేషన్ గరుడ అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చి బీజేపీపైకి నెడుతున్నారని మండిపడ్డారు. శివాజీ చెప్పింది వాస్తవమో కాదో తెలుసుకునేందుకు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరపాలన్నారు. జగన్‌పై దాడిని ఏపీ పోలీసు వ్యవస్థ అడ్డుకోలేకపోయిందన్నారు. ఆ దాడిని ప్రభుత్వ వైఫల్యంగా భావించి సీఎం - హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేయాలని మాణిక్యాల రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. శివాజీని అదుపులోకి తీసుకొని...`ఆపరేషన్ గరుడ` వెనక ఎవరున్నారో విచారణ జరిపించాలన్నారు. విచారణ జరిపితే దాని వెనకున్న పెద్దలకు, ప్రభుత్వానికి నష్టమా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.