Begin typing your search above and press return to search.
వంశీయే కాదు..మరో ఎమ్మెల్యే సైతం టచ్‌లోకి..బీజేపీ బిగ్ బాంబ్
By: Tupaki Desk | 28 Oct 2019 12:00 PM GMTకృష్ణాజిల్లా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ హాట్ హాట్ గా నడుస్తుంటే బిజెపి బిగ్ బాంబ్ పేల్చింది. వంశీ రాజీనామా ఎలా మలుపులు తిరిగి.. ఎటువైపు దారి తీస్తుందో ప్రస్తుతానికి అయితే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. టీడీపీకి - తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వంశీ వైసీపీలోకి వెళ్తారా..? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టిడిపిలోనే ఉంటారా? లేదా బీజేపీలోకి వెళతారా? అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. వంశీ ఎపిసోడ్ ఇలా నడుస్తుండగానే బిజెపి నేత రఘురాం చేసిన సంచలన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది.
వల్లభనేని వంశీతో పాటు టీడీపీకే చెందిన మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ - వైసీపీని సంప్రదిస్తున్నారని బాంబ్ పేల్చారు. ఎమ్మెల్యే పదవికి - టీడీపీకి రాజీనామా చేసిన వంశీ బీజేపీ - వైసీపీతో చర్చించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఓ కంట కనిపెడుతూ ఉన్న బిజెపి సరైన టైమ్ కోసం కాచుకుని కూర్చుని ఉంది. ఈ క్రమంలోనే టిడిపికి చెందిన కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లిపోగా.... మరికొందరు సైతం టచ్ లో ఉన్నమాట మాత్రం వాస్తవం. వీరు కూడా పరిస్థితిని బట్టి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బిజెపి సైతం టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని లీకులు ఇస్తూ కొద్ది రోజులుగా మైండ్ గేమ్ ఆడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీలో చేరాల్సిన నేతలు దైర్యంగా చేరవచ్చని వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే నేతలకు తాము అండగా ఉంటామని రఘురాం చెప్పారు. ఏపీలో ప్రస్తుతానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు బీజేపీదేనని ఆయన జోశ్యం చెప్పారు.
అలాగే ఇతర పార్టీల్లో మచ్చలేని రాజకీయ ఆయన నేతలకు బిజెపిలోకి ఎప్పుడూ ఆహ్వానం ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే టైంలో స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారే వారిని తాము నమ్మం అని హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనా వంశీ ఎపిసోడ్ తోనే ఏపీ రాజకీయం హాట్ హాట్ గా ఉంటే... ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు సైతం బిజెపి బయటపెట్టడంతో ఈ జంపింగ్ ల ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.