Begin typing your search above and press return to search.
హత్రాస్ బాలిక క్యారెక్టర్ మంచిది కాదన్న బీజేపీ నేత.. దుమారం
By: Tupaki Desk | 7 Oct 2020 2:30 PM GMTఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతలకు అస్సలు మానవత్వం.. మనసాక్షి లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. హత్రాస్ జిల్లాలో దళిత బాలికపై నలుగురు అత్యాచారం చేసి హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఈ విషయంలో నిన్న మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ‘కూతుళ్లకు సంస్కృతి, సంప్రదాయాలకు నేర్పించాలని.. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవు’ అంటూ నోరు పారేసుకున్నారు.
తాజాగా మరో బీజేపీ నాయకుడు ఏకంగా హత్రాస్ దళిత బాలిక క్యారెక్టర్ మంచిది కాదంటూ మాట్లాడడం పెద్ద దుమారం రేపింది. బీజేపీ నాయకుడు రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ.. తాజాగా హత్రాస్ బాధితురాలిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. 44కు పైగా క్రిమినల్ కేసులున్న ఈయన హత్రాస్ బాధిత యువతికి నిందితుడితో సంబంధం ఉందని.. నేరం జరిగిన రోజు యువతే నిందితుడిని మొక్కజొన్న చేనులోకి పిలిచిందని బీజేపీ నేత రంజిత్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది.నిందితుడిని ప్రేమించడం వల్లే అతడిని యువతి పొలాల్లోకి పిలిచిందని ఆరోపించారు.
అవారా యువతులు చెరుకు, మొక్కజొన్న, జొన్న పొలాల్లో పొదలు, అడవుల్లో మరణిస్తూ ఉంటారని రంజిత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. హత్రాస్ నిందితులను జైలు నుంచి విడుదల చేయాలని శ్రీవాస్తవ కోరాడు. వాళ్లు నిర్ధోషులంటూ చెప్పాడు.
అంతేకాదు.. తాజాగా యూపీలో బాధిత హత్రాస్ యువతి ఇంటికి సమీపంలోనే నిందితులకు మద్దతుగా అగ్రవర్ణాల వారు ర్యాలీ నిర్వహించడం కూడా సంచలనంగా మారింది.