Begin typing your search above and press return to search.

క్షమించండి , అది నా తప్పు కాదు , నాకు తెలియకుండా జరిగింది !

By:  Tupaki Desk   |   16 Nov 2020 3:10 PM GMT
క్షమించండి , అది నా తప్పు కాదు , నాకు తెలియకుండా జరిగింది !
X
ఎంతటి రాజకీయ నాయకుడైనా కూడా , తాను చేసిన విమర్శల పై వ్యతిరేకత వచ్చిన సమయంలో ఆ మాటలపై వెనక్కి తగ్గక తప్పదు. ఎంతోమంది నేతలు అనేక సందర్భాల్లో ఎన్నో అనకూడని మాటలు అని , ఆ తర్వాత నెటిజన్ల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తే తప్పు జరిగింది అంటూ వెనక్కి తగ్గుతుంటారు. తాజాగా ఏపీ బీజేపీ నేత రమేష్‌ నాయుడు నాగోతు తన ట్వీట్‌ను డెలిట్‌ చేశారు. ఇంతకీ అయన డిలీట్ చేసిన ట్విట్ ఏమిటి అంటే .. గతంలో నాథూరామ్‌ గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించిన రమేష్‌ నాయుడు నాగోతు, తాజాగా ఆ ట్విట్ ను తొలగించారు.

నవంబరు 15న గాడ్సే వర్ధంతిని పురస్కరించుకని.. ‘‘నేడు నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ముందెన్నడూ ఇలాంటి గొప్ప దేశభక్తుడు జన్మించలేదు’’అని నివాళులు అర్పించారు. అయితే , ఆ ట్విట్ పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జాతిపిత మహాత్మా గాంధీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో రమేష్‌ నాయుడు చేసిన పోస్టును, గాడ్సేను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ను పోలుస్తూ .. రాజకీయాల కోసమే రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. దీంతో ట్వీట్‌ను డెలిట్‌ చేయడంతో పాటుగా తన ట్విటర్‌ ఖాతాను నిర్వహిస్తున్న వారికి కూడా ఉద్వాసన పలికినట్లు రమేష్‌ నాయుడు మరో ట్వీట్‌ లో తెలిపారు. ‘నా ట్విటర్‌ను హ్యాండిల్‌ చేస్తున్నవారు అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిని, వారి సేవలను తొలగించడమైనది’’ అంటూ వివరణ ఇచ్చాడు