Begin typing your search above and press return to search.
వైసీపీ గెలుపు వ్యూహమేంటో చెప్పిన బీజేపీ నేత
By: Tupaki Desk | 16 Dec 2022 2:30 AM GMTఅదేంటి వైసీపీ గెలుపు వ్యూహాలు ఎత్తులు జిత్తులు మరో పార్టీకి ఎలా తెలుస్తాయని అనుకుంటున్నారా. అయితే బీజేపీ నేత మాటలను విని తీరాల్సిందే. విశాఖకు చెందిన బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఫైర్ బ్రాండ్. ఆయన నోరు విప్పితే చాలు మాటలతో మంటలను పుట్టిస్తారు. ఏపీలో వైసీపీ పాలన గురించి ఆయనే విమర్శించాలి. టీడీపీ తరువాత వైసీపీని బీజేపీలో ఎవరు ఎక్కువ విమర్శిస్తారు అంటే ముందు రాజు గారి పేరే వినిపిస్తుంది.
రాజు గారు జగన్ పాలన అంటే మండిపోతారు. ఏపీని సర్వనాశనం చేశారంటూ విరుచుకుపడతారు. తాజాగా రాజు గారు మీడియా మీటింగ్ పెట్టి మరీ చెడా మడా వైసీపీ పాలనను కడిగిపారేశారు. ఏపీని అప్పుల ఆంధ్రగా నంబర్ వన్ గా చేసిన ఘనత వైసీపీది అని దుయ్యబెట్టారు. వైసీపీ ఏలుబడిలో ఉద్యోగులకు నెల జీతాలు కూడా లేని దుస్థితి దాపురించిందని ఇదేనా పాలన అంటూ ఫైర్ అయ్యారు.
ఎటు చూసినా అన్యాయం అవినీతి దమన కాండ తప్ప సాఫీగా పాలన చేశారా అని ఆయన విరుచుకుపడ్డారు.ఇక ఆయన ఆగలేక ఒక పెద్ద మాట అనేశారు. ఏపీకి జగన్ సీఎం గా ఉండడం ప్రజల దురదృష్టం అని ఆయన అల్టిమేట్ డైలాగ్ వాడేశారు. జగన్ని సీఎం గా ఎన్నుకున్నందుకు ప్రజలు బ్యాడ్ లక్ ని భరించాల్సిందే అని ఆయన వేదాంతం కూడా వల్లించారు.
వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం, అన్ని సీట్లూ మావే అని వైసీపీ నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు కదా ఎలా అంటే దానికి రాజు గారు ఇచ్చిన రిప్లై ఇంటరెస్టింగ్ గా ఉంది. ఏపీలో అవినీతి డబ్బు అంతా వైసీపీ నేతల వద్దనే ఉంది, మరో వైపు కండబలం దండీగా ఉంది. ఇంకో వైపు పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవడమే వైసీపీ వ్యూహమని ఫ్యాన్ పార్టీ లోగుట్టు రాజు గారు విప్పి చెప్పేశారు.
ఏపీలో అవినీతి బాగా పెరిగిందని, వైసీపీ నాయకులు బాగా అందులో ఆరితేరారని రాజు గారు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టి గెలవాలని ఒక్కో ఎమ్మెల్యే చూస్తున్నారని, వారికే టికెట్లు కూడా ఇస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ధనబలంతోనే వైసీపీ గెలవాలని చూస్తోంది తప్ప జన బలంతో జనాభిమానంతో కానే కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణాలో దాడులు చేస్తున్న సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి సంస్థలు ఏపీలో కూడా దాడులు చేస్తే పెద్ద ఎత్తున నల్లధనం బయటపడుతుంది అని రాజు గారు అంటున్నారు. ఏపీలో కచ్చితంగా ఈడీ సీబీఐ చూపు చూడాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి జగన్ సీఎం కావడం జనం ఖర్మని, వైసీపీ మళ్ళీ గెలిస్తే అది అవినీతి అక్రమాలతో అని రాజు గారు తనదైన విశ్లేషణను అందించేశారు. ఇక దీని మీద వైసీపీ వారి నుంచి విమర్శలు ఏ రేంజిలో ఉంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.