Begin typing your search above and press return to search.
మంటపుట్టిందా..మీరూ చెప్పుల జత పంపండి
By: Tupaki Desk | 30 Dec 2017 9:39 AM GMTఎందుకలా రెచ్చగొడతారు? అన్న భావన కలిగిందా? అయితే.. మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. రెచ్చగొట్టాలని కాదు. ఒక బాధిత కుటుంబం పట్ల సహజంగా ఉండాల్సిన కనీస జాలి కూడా లేని దాయాది పాకిస్థాన్‌కు బుద్ది చెప్పటానికి ఆ మాత్రం రియాక్ట్ కావటం ఎంతమాత్రం తప్పు కాదు. దాయాదితో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణికి భారత ప్రభుత్వమే కాదు.. భారత ప్రజలు కూడా వ్యతిరేకమే. ఇక.. మీడియా అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని సందర్బాల్లో పాక్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసే బ్యాచ్ కూడా లేకపోలేదు. అదేమంటే విశ్వ మానవుల మాదిరి ఫోజులు కొడుతూ మాట్లాడేస్తుంటారు.
అలాంటి వారిని సంగతి అలా ఉంటే.. ఇటీవల భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను అక్రమంగా అదుపులోకి తీసుకోవటమే కాదు.. ఆయనపై గూఢచర్యం కేసును పెట్టి ఊచలు లెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కన్న కొడుకును.. ఆయన తల్లి.. కట్టుకున్న భర్తను ఆయన సతీమణి చూసేందుకు పాక్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అమానుషంగా అవమానించేలా పాక్ అధికారులు వ్యవహరించటమే కాదు.. మీడియా సైతం దుర్మార్గంగా వ్యవహరించారు. జాదవ్ కుటుంబ సభ్యులకు తీవ్ర అవమాన భారాన్ని మిగిల్చిన ఈ ఉందతం దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేయటమే కాదు.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యేలా చేసింది.
కుటభూషణ్ ను చూసేందుకు తల్లి.. భార్యల కుంకుమ.. తాళిని బలవంతంగా తీసేయించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియని జాదవ్.. తల్లిని చూసి నాన్నకు ఏమైందని అడిగిన వైనం బయటకు వచ్చింది. జాదవ్ కుటుంబ సభ్యుల్ని తీవ్రస్థాయిలో అవమానించారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిరసనల వేళ ఢిల్లీకి చెందిన బీజేపీ నేత ఒకరు పాక్ హైకమిషన్ కు ఆన్ లైన్లో చెప్పుల జతను డెలివరీ చేసి తన నిరసనను తెలియజేశారు. కులభూషణ్ తల్లి.. భార్య విషయంలో వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గా.. ఆన్ లైన్లో చెప్పులు కొనుగోలు చేశారు. వాటి డెలివరీ అడ్రెస్ గా పాకిస్థాన్ హైకమిషన్ అడ్రస్ ఇచ్చారు. పాకిస్థాన్ కు మన చెప్పులు కావాలి. వారికి చెప్పులు పంపండి.. నేను చెప్పులు ఆర్డర్ చేశా అంటూ ట్వీట్ చేశాను. ఆన్ లైన్ లో పాకిస్థాన్ కు చెప్పులు పంపాలంటూ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. గంటల వ్యవధిలో ఇప్పటికే పాక్ హైకమిషన్ కు వందలాది మంది భారతీయులు ఫుట్ వేర్ పంపిస్తున్నారు. పాక్ ప్రభుత్వం.. అధికారులు.. అక్కడి మీడియా కలిసికట్టుగా జాదవ్ ఫ్యామిలీని అవమానించిన వేళ.. దేశ ప్రజలు చెప్పల జతను పంపటం తప్పేం కాదు. అయితే.. మరీ ఖరీదైనవి కాకుండా.. వీలైనంత చౌకగా ఉన్నవి పంపండి. వారి స్థాయికి అవి సరిపోతాయి.
భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ జాదవ్ కుటుంబసభ్యులతో పాకిస్తాన్ వ్యవహరించిన అమానుష ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత్ పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ నిరసనలో భాగంగా ఢిల్లీ బీజేపీ లీడరు - పాకిస్తాన్ హై కమిషన్ కు ఆన్ లైన్ లో చెప్పులను డెలివరీ చేశారు. కులభూషణ్ తల్లి - భార్యతో వ్యవహరించిన తీరు పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ఈ చెప్పులను డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు.