Begin typing your search above and press return to search.
మీడియా ముందు ఏడ్చిన బీజేపీ లీడర్ !
By: Tupaki Desk | 17 April 2018 4:51 PM GMTదేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయి నేతల ప్రచారంతో ఆ రాష్ట్రం వైపు అందరి చూపు పడుతుండగా...తాజాగా పార్టీ అంతర్గత వ్యవహరాలతో నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అధికారంలో భాగం అవుదామనుకునే నేతలకు ఎన్నికలను మించిన అందివచ్చిన సందర్భం మరొకటి ఉండదు కదా..అలాంటి సందర్భంలోనే ఆవేదన చెందిన ఓ బీజేపీ నాయకుడి తీరు మీడియాలో వైరల్ అయింది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టికెట్ రాలేదని బీజేపీ నేత కన్నీరు పెట్టుకున్నారు.
కర్ణాటక ఎన్నికల బరిలో నిలిచే 82 మంది పేర్లతో కూడిన రెండో జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో 12 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా - గుల్బార్గా నగర డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బీజేపీ నేత శశిల్ జీ నమోషి పేరు లేదు. గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. నమోషి స్థానంలో సీబీ పాటిల్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా నమోషి.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీంతో ఒక్కసారిగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
ఈ సమయంలో నమోషి అనుచరులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు. గత పన్నేండు సంవత్సరాల నుంచి నమోషి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గుల్బర్గా దక్షిణం లేదా గుల్బర్గా ఉత్తరం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గానికి తన పేరు ఎంపిక చేస్తారని నమోషి భావించారు. కానీ ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా తన పేరును ఖరారు చేయకపోవడంతో నమోషి తీవ్ర ఆవేదన చెందారు. కాగా, శశీల్ జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) తరపున 2013 లో గుల్బార్గా దక్షిణ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.