Begin typing your search above and press return to search.
ప్రముఖ జర్నలిస్టుకు షాకిచ్చిన బీజేపీ నేత
By: Tupaki Desk | 9 Dec 2020 1:42 PM GMTజాతీయ న్యూస్ చానెళ్లలో పనిచేసే జర్నలిస్టులు నిర్వహించే లైవ్ షోలు వాడీవేడిగా జరుగుతుంటాయి. తాము డిబేట్ నిర్వహించే టాపిక్ పై ఎంతోకొంత అవగాహన ఉన్న జర్నలిస్టులు ఆ లైవ్ షోలలో పాల్గొనేవారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ఇక, బీజేపీ వీర విధేయుడిగా పేరున్న ఆర్నబ్ గోస్వామి వంటి జర్నలిస్ట్ అయితే....విషయం కొంచెం అటుఇటుగా ఉన్నా...తన వాగ్ధాటితో, దూకుడుతో ఎదుటివారిపై మాటలదాడి చేసి దబాయించి తన షోను హైజాక్ చేస్తుంటారు. అయితే, నిన్న ఇండియాటుడే చానెల్ లో జరిగిన ఓ లైవ్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ అయిన రాజ్ దీప్ సర్దేశాయ్ కు...డిబేట్ చేస్తోన్న అంశంపై కనీస అవగాహన లేక....అటు దూకుడుగా వ్యవహరించ లేని ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తన షోను తానే హైజాక్ చేయబోయిన రాజ్ దీప్ అడ్డంగా దొరికిపోయారు. వ్యవసాయ బిల్లుల రద్దుపై చర్చ సందర్భంగా బీజేపీ నేత అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాజ్ దీప్ ఇబ్బంది పడ్డారు. దీంతో, ఆ నేతపై ఎదురుదాడి చేసి ఇరుకున్న పెట్టాలనుకున్న రాజ్ దీప్ కు ఆ నేత దీటుగా సమాధానమివ్వడంతో అడ్డంగా బుక్ అయ్యారు.
కాంగ్రెస్ అనుకూలుడిగా పేరొందిన రాజ్ దీప్...కాంగ్రెస్ అనుకూల చానెళ్లలో పనిచేస్తుంటారన్న టాక్ ఉంది. ఆర్నబ్ తరహాలో పూర్తిగా బీజేపీని వెనకేసుకురాకుండా...సందర్భానుసారంగా కాంగ్రెస్ కు మద్దతిస్తుంటారు రాజ్ దీప్. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 8న భారత్ బంద్ సందర్భంగా కొత్త వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకుడు...రాజ్దీప్ ను ఇరకాటంలో పెట్టారు. మోడీ సర్కార్ తెచ్చిన బిల్లులపై బీజేపీ నేతను ఇరుకున పెడుతున్న రాజ్ దీప్ ను హఠాత్తుగా ఆ నేత అడిగిన ప్రశ్న ఇరకాటంలో పడేసింది. కొత్త వ్యవసాయ బిల్లుల పేర్లు, వివరాలు చెప్పాలంటూ రాజ్ దీప్ ను ఆ నేత ప్రశ్నించడంతో రాజ్ దీప్ షాకయ్యారు. సీనియర్ జర్నలిస్టు అయిన రాజ్ దీప్...వ్యవసాయ బిల్లుల పేర్లు చెప్పకుండా గూగుల్ చేసి వెతుకుతున్నారంటూ ఆ నేత ప్రశ్నించడంతో రాజ్ దీప్ ఎదురుదాడికి దిగారు. ఆ షోలో తానే ప్రశ్నలేయాలంటూ దబాయించలని చూసిన రాజ్ దీప్ ను...మీరేమైనా డిక్టేటరా అంటూ సదరు బీజేపీ నేత ప్రశ్నించడంతో ఖంగుతిన్నారు. ఇలా, రాజ్ దీప్ అడ్డంగా బుక్కయిన వైనం జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది.