Begin typing your search above and press return to search.
బాబు అన్ని వేల కోట్లు దోచేశాడన్న సోము
By: Tupaki Desk | 15 Jun 2018 7:50 AM GMTఏపీ అధికారపక్షం తెలుగుదేశం పార్టీకి.. బీజేపీకి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ బూచిని చూపించి మోడీతో బాబు కటీఫ్ చెప్పటం తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీపై బాబు.. బాబుపై బీజేపీ నేతలు ఓ రేంజ్లో విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు.
ఏ చిన్న అవకాశం చిక్కినా బండకేసినట్లుగా బాదేస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. విమర్శలు.. ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మైకు దొరికితే చాలు చెలరేగిపోతున్నారు. కాసింత జనాలు ఉన్న వేదిక మీద అయితే.. ప్రధాని మోడీపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు తీవ్రంగా ఉంటున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల ఎజెండాని సెట్ చేసే పనిలో భాగంగా.. ఇప్పటి నుంచే మోడీ చేసిన దారుణాలంటూ బాబు అదే పనిగా మండిపడుతున్నారు. అయితే... దీనికి కౌంటర్ గా మోడీ మాట్లాడకున్నా.. ఆయన అనుచర వర్గం అదే పనిగా ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా సోము వీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేలా తాజా ఆరోపణలు ఉన్నాయి. గృహ నిర్మాణాల్లో బాబు రూ.30వేల కోట్లు దోచేస్తున్నట్లుగా మండిపడ్డారు టీడీపీ కార్యకర్తలకు ఉపాధిగా నీరు-చెట్టు కార్యక్రమం మారిందన్న సోము.. ఉపాధి హామీ పథకంలో రూ.13వేల కోట్లు దోచేశారన్నారు. గృహనిర్మాణం.. ఉపాధి హామీ పథకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా బాబుపై మరో తీవ్ర వ్యాఖ్య ఒకటి చేశారు. కాంగ్రెస్ రక్తం పెట్టుకొని.. పచ్చ చొక్కా వేసుకున్న నేతగా అభివర్ణించారు. రానున్నరోజుల్లో బాబుకు ఏయే అంశాలు గుదిబండగా మారనున్నాయన్న విషయాన్ని సోమ చెప్పకనే చెప్పేసినట్లుగా లేదూ?