Begin typing your search above and press return to search.
పీకే ప్రమోషన్ కోసం అమిర్ అంత పని చేశాడా?
By: Tupaki Desk | 16 Jan 2016 8:05 PM GMTవివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలందరికి ఒక దారి అయితే.. సుబ్రమణ్య స్వామిది మరో దారి. ఆయన నోటి నుంచి వచ్చే చాలా ఆరోపణలు సంచలనం సృష్టిస్తుంటాయి. కొన్ని అంశాలైతే కోర్టు వరకు వెళ్లి.. ఆయన ఆరోపణలు చేసిన వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. మొన్నామధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆమె కుమారుడు.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల మీద నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారం కోర్టుకు వెళ్లటమే కాదు.. కోర్టు గడప తొక్కాల్సిన పరిస్థితికి స్వామే కారణం.
తాజాగా ఆయన బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నటించి.. సూపర్ హిట్ అయిన పీకే సినిమాకు సంబంధించి ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్నే రేపాయి. కాసేపటికి క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన పీకే సినిమా ప్రమోషన్ కోసం పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) సహకారం తీసుకున్నట్లుగా ఆరోపించారు.
పీకే చిత్రంపై సుబ్రమణ్యస్వామి గతంలోనూ పలు విమర్శలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఈ చిత్రాన్ని రూపొందించారని.. సిక్కును ఒక బిచ్చగాడిలా చూపించి వారి మనోభావాల్ని పీకే చిత్రంలో దెబ్బ తీశారంటూ వ్యాఖ్యానించారు. తాజాగా.. ఐఎస్ఐ సంస్థతో అమిర్ పేరు జతకట్టటం సంచలనంగా మారింది.
దేశంలో పెరిగిన అసహనం కారణంగా దేశం విడిచివెళ్లిపోదామా అని తన భార్య తనతో అన్నదంటూ ఆ మధ్య అమిర్ వ్యాఖ్యలు చేయటం.. అవి పెద్ద ఎత్తున దుమారం రేపటం.. కొద్ది రోజుల కిందటే ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచార కర్తగా ఉన్న అమిర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. సుబ్రమణ్య స్వామి చేసిన తీవ్రమైన ఆరోపణల మీద అమిర్ స్పందన ఏమిటో..?