Begin typing your search above and press return to search.
క్రిస్ మస్ తప్ప.. ఏపీలో దేనికీ చోటు లేదు.. బీజేపీ నేత ట్వీట్
By: Tupaki Desk | 25 Jan 2022 1:40 PM GMTఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును గుడివాడలో అరెస్టు చేసి.. వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పడం .. అనంతర పరిణామాలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. విజయవాడ బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి గుడివాడలో బీజేపీ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ను పోలీసులు అడ్డుకున్నారు. ఉంగుటూరు మండలం నందమూరి అడ్ రోడ్డు వద్ద బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టు అయ్యారు.
ట్రక్ ఆటోలో ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కు సోము వీర్రాజు బీజేపీ నేతలను తరలించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సోము వీర్రాజు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీఎం రమేష్ మాట్లాడుతూ, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని, గుడివాడలో 144 సెక్షన్ ఉందా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. సోము వీర్రాజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత సంబరాలను ననిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్ ప్రశ్నించారు రాష్ట్రంలో ఒక్క క్రిస్టియన్ పండుగ మాత్రమే నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుందని.. ఇతర హిందూ పండుగలకు అవకాశం లేదని.. ఆయన నిప్పులు చెరిగారు. ఇక, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక, బీజేపీ మిత్రపక్షం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సోము సహా ఇతర నేతల అరెస్టును ఖండించారు.