Begin typing your search above and press return to search.
ఈ ముష్టి వేసినందుకే వాయిస్ రైజవుతోందే?
By: Tupaki Desk | 19 Aug 2016 10:58 AM GMTకేంద్రంలోని మోడీ సర్కారు కేవలం రెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అది కూడా మూడు పద్దుల కింద ఆంధప్రదేశ్ రాష్ట్రానికి విదిలించింది. ఇది చాలా ముష్టి మొత్తం కింద లెక్క. ఇప్పటికే ఆ దిశగా అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ మాత్రం ముష్టి విదిలించినందుకే రాష్ట్రంలోని భాజపా నాయకుల వాయిస్ మళ్లీ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు లేదా ఇతర తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు గుప్పించే తమ వ్యవహార సరళిని ఏపీ భాజపా నాయకులు మళ్లీ షురూ చేస్తున్నారు. రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి సురేశ్ రెడ్డి తాజాగా విరుచుకుపడడం విశేషం.
ఇన్నాళ్లకు చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడుగుతోంటే భాజపా నాయకులకు అది కూడా నచ్చుతున్నట్లు లేదు. హోదా గురించి మోడీ సర్కారును నిలదీసే ముందు చంద్రబాబునాయుడు తాను రాష్ట్రంలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని సురేశ్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబునాయుడు అత్యల్ప ఓట్ల తేడాతోనే గద్దె నెక్కి.. అరాచకత్వం చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి ఆరోపిస్తూనే ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్న మాటలు కూడా వైకాపా నేతల వాదననే సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
కేంద్ర నిదుల్ని చంద్రబాబు ఎలా దారి మళ్లిస్తున్నారో - కేంద్ర సాయాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో.. భాజపా నాయకులు ఇటీవలి కాలం వరకు తీవ్రస్థాయిలో ఎండగడుతూ ఉండేవారు. కొన్నాళ్ల కిందట ఉభయులకు ఒక ఒప్పందం కుదిరినట్లుగా.. హఠాత్తుగా ఈ విమర్శలు ఆగిపోయాయి. అసలే కేంద్ర సాయం గురించి ప్రజలంతా మోడీని తిట్టుకుంటూ ఉండగా, తాము నోరు మెదపడం ఎందుకు లెమ్మని రాష్ట్ర భాజపా సైలెంట్ అయిందేమో అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కేవలం రెండు వేల కోట్ల రూపాయల ముష్టి విదిలించినందుకే రాష్ట్ర భాజపా నాయకులు మళ్లీ వాయిస్ రైజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మళ్లీ వాళ్లు చంద్రబాబును ఓ ఆటాడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఎంతకాలమూ రాష్ట్ర భాజపాను జోకొట్టి పడుకోబెట్టడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.