Begin typing your search above and press return to search.

రాయ‌ల‌సీమ‌పై టీడీపీ క‌క్ష క‌ట్టిందా?

By:  Tupaki Desk   |   16 Jun 2018 10:42 AM GMT
రాయ‌ల‌సీమ‌పై టీడీపీ క‌క్ష క‌ట్టిందా?
X
మొన్న‌టిదాకా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా వ‌ద్దు - ప్యాకేజీనే ముద్దు అంటూ బీజేపీతో అంట‌కాగిన చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో హోదా కావాలంటూ బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని కేంద్రాన్ని బ‌ద్ నాం చేస్తున్నారు. ఇక ఇప్పుడు హ‌ఠాత్తుగా క‌డ‌పలో స్టీల్ ప్లాంట్ అంటూ కొత్త రాగం ఎత్తుకుంది టీడీపీ. దీని కోసం తాను త్వ‌ర‌లో ఆమ‌ర‌ణ‌దీక్ష చేప‌డుతున్న‌ట్లు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ పార్టీ టీడీపీ గుట్టును ర‌ట్టుచేస్తుంది.

రాయ‌ల‌సీమ కోసం టీడీపీ నేత‌లు దొంగ‌దీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇంత‌లా రాయ‌ల‌సీమ కోసం ఆరాట‌ప‌డుతున్న‌ట్లు న‌టిస్తున్న చంద్ర‌బాబు నాయుడు గ‌త నాలుగేళ్లుగా క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ గురించి ఒక్క సారి కూడా ఎందుకు మాట్లాడ‌డం లేదు ? ఏనాడు కేంద్రాన్ని ఎందుకు అడ‌గ‌లేదు ? అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేవైఎం అధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

2014 డిసెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. 2016లో అడిగినా కూడా రాష్ట్రం నుండి ఎలాంటి స్పంద‌నా లేదు. ప‌రోక్షంగా ఈ జిల్లాలో ప‌రిశ్ర‌మ వ‌ద్దు అన్న‌ట్లు టీడీపీ నేత‌లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని తీర్చుకుంటున్న క‌క్ష్య‌లో భాగ‌మే ఇద‌ని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.

నిజంగా టీడీపీకి చిత్త‌శుద్ది ఉంటే రాయ‌ల‌సీమ‌లో హైకోర్టును ఏర్పాటు చేయాలి. రెండో రాజ‌ధానిని చేయాలి. టీడీపీ ఇది చేయ‌డానికి సిద్దంగా ఉందా ? ఉక్కు ప‌రిశ్ర‌మ పెట్టేందుకు కేంద్రం సిద్దంగా ఉంది అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. రాయ‌ల‌సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు- ప్రధాని కడప జిల్లాకు రానున్నారని, సీమ‌ను అభివృద్ది చేయ‌కుండా టీడీపీ రాజ‌కీయం చేస్తుంద‌ని విమ‌ర్శించారు.