Begin typing your search above and press return to search.
మోడీ టీంలో మంట పుట్టించిన బీజేపీ నేత వ్యాసం
By: Tupaki Desk | 27 Sep 2017 4:24 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంపై బీజేపీ నేతల్లో ఉన్న అసంతృప్తి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మోడీ నిర్ణయాలపై బీజేపీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారని విపక్ష నేతలు ఇన్నాళ్లు చేసిన విమర్శ తాజాగా నిజమని తేలింది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సొంత పార్టీలోని సీనియర్ నేతే ఘాటుగా విమర్శించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.. మోడీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలపై విరుచుకుపడ్డారు.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన యశ్వంత్ సిన్హా ఆర్టికల్ బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాటలో ఉందని ఈ ఆర్టికల్‌లో ఆయన రాశారు. జీఎస్టీ - నోట్ల రద్దు రెండూ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన రోగాలుగా మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బాగాలేదని ఆయన స్పష్టంచేశారు. బీజేపీలోనూ చాలా మంది తన అభిప్రాయంతోనే ఉన్నారని, అయితే వాళ్లెవరూ బయటకు చెప్పడం లేదని సిన్హా సంచలన కామెంట్ కూడా చేశారు. వచ్చే 18 నెలల్లో మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలపైకి తేవడం అసాధ్యమని ఆయన స్పష్టంచేశారు. ఆ దిశగా ఓ బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు.
జీడీపీ వృద్ధి రేటులో సరైన లెక్కలు లేవని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి రేటును మోడీ ప్రభుత్వం ఎక్కువ చేసి చూపిస్తోందని సిన్హా తన వ్యాసంలో ఆరోపించారు. ప్రస్తుతం 5.7 శాతం వృద్ధిరేటు చూపిస్తున్నారంటే అది 3.7 శాతం వరకు మాత్రమే ఉండొచ్చని యశ్వంత్ సిన్హా అంచనా వేశారు. ప్రైవేట్ పెట్టుబడులు గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయని - పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా పతనమైందని సిన్హా అన్నారు. వ్యవసాయం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నదని - సేవారంగం వృద్ధి కూడా మందగించిందని ఆయన తెలిపారు. నోట్లు రద్దు భారీ నష్టాన్ని మిగిలిస్తే.. సరిగా అమలు చేయని జీఎస్టీ వ్యాపారాలతో ఆడుకున్నదని సిన్హా అన్నారు. కాగా, సిన్హా వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ ప్రచార అభివృద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.