Begin typing your search above and press return to search.
సొంత సర్కారుపై బీజేపీ సీనియర్ నిరసన..
By: Tupaki Desk | 6 Dec 2017 7:54 AM GMTకేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఇటీవలి కాలంలో సొంత పార్టీకే షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. కొద్దికాలం కిందటి వరకు ఢిల్లీ పెద్దలను వణికించిన సిన్హా ఇప్పుడు గల్లీలో తన పోరాటాన్ని మొదలుపెట్టారు. అందులోనూ తమ బీజేపీ సర్కారు పైనే ఆయన ఎర్రజెండా ఎగురవేశారు. తన కుమారుడు జయంత్ సిన్హా ప్రధాని మోడీ క్యాబినేట్‌లో మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్ టీని యశ్వంత్ సిన్హా వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా తాజాగా బీజేపీ సర్కారుపై ఆయన మండిపడ్డారు. పత్తి - సోయాబిన్ రైతు సమస్యలపై యశ్వంత్ సిన్హా ఆందోళన చేశారు, దీన్ని పలు మలుపులు తిప్పారు
పురుగుమందుల కారణంగా పంట తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ వందలమంది పత్తి, సోయాబిన్ రైతులతో కలిసి కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి - సీనియర్ నేత యశ్వంత్ సిన్హా నిన్న మహరాష్ట్రలోని అకోలాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనలో సిన్హా మాట్లాడుతూ...పార్టీ రాజకీయాల్లోకి తాను తలదూర్చడం లేదన్నారు. రైతులకు ఉపశమనం కలగాలన్నదే తమ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఎటువంటి రాజకీయ దురుద్ధేశం లేదని.. రైతు సమస్యల నుంచి పక్కకు వెళ్లేదిలేదని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై 50 శాతం అధికంగా రైతులకు చెల్లిస్తామని ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి రాగానే దాన్ని పక్కనపెట్టేశారని పేర్కొన్నారు. తన నిరసన రాజకీయపరం కాదన్నారు. రైతు సమస్యలను తెలిపేందుకు తమను సీఎం ఫడ్నవీస్ వద్దకు తీసుకువెళ్లాలి లేదా.. సీఎం అయినా తమ వద్దకు రావాలన్నారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు రైతులు పండించిన పంటనంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
కాగా, మహారాష్ట్రలోని అకోలాలో నిరసన చేపట్టిన యశ్వంత్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. సిన్హాతో పాటు దాదాపు 250 మంది రైతులను సోమవారం సాయంత్రం 5.30 గంటలకు అదుపులోకి తీసుకున్నాం. రాత్రి 9.50 గంటలకు విడిచిపెట్టాం. కాగా సిన్హా బయటకు వెళ్లేందుకు నిరాకరించి స్టేషన్ లో ఉండిపోయారన్నారు. సిన్హా ఏడు డిమాండ్లలో ఆరు డిమాండ్లకు ఇప్పటికే ఒప్పకున్నామని ఏడో డిమాండ్ పై సైతం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఆస్టిక్ కుమార్ పాండే తెలిపారు. కాగా, అరెస్టై పోలీస్ స్టేషన్ లో ఉన్న బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాకు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ మద్దతును ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.