Begin typing your search above and press return to search.
మీరొద్దు..మీ పథకాలు కావాలి: చంద్రబాబు
By: Tupaki Desk | 14 Feb 2019 4:46 PM GMTచంద్రబాబు డిక్షనరీలో ప్రస్తుతం ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదం బీజేపీ. ఎందుకంటే ఆయన డిక్షనరీలో ఎప్పటికప్పుడు అవసరార్థం పదాలు మారిపోతుంటాయి. ప్రస్తుతం ఆయన టార్గెట్ బీజేపీయే. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని బండబూతులు తిడుతున్నారు చంద్రబాబు. అయితే చంద్రబాబుకి బీజేపీ వద్దు కానీ వాళ్ల పథకాలు మాత్రం కావాలి. ఓ పక్క వాళ్లని తిడుతూనే.. కేంద్రంలో బీజేపీ ప్రవేశపెడుతున్న పథకాల్ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టేస్తున్నారు. అయితే.. కాపీలో కూడా చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. వాటిని తన పథకాలుగా కాస్త అటూ ఇటూ పేర్లు మార్చి చలామణీ చేసుకుంటున్నారు.
ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన మరో పథకాన్ని కూడా తన ఎక్కౌంట్ లో వేసుకున్నారు చంద్రబాబు. మొన్న బడ్జెట్ లో ప్రతీ రైతుకు రూ.6000 ఇవ్వబోతున్నట్లు… డైరెక్ట్ గా రైతుల ఎక్కౌంట్ లోనే వేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక నిన్నటికి నిన్న రైతులకు రూ.10 వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ చంద్రబాబు మార్క్ రాజకీయం దాగుంది. మోదీ ఇవ్వబోతున్న రూ.6000లకు చంద్రబాబు రూ.4000 కలిపి ఇవ్వబోతున్నారన్నమాట. ఈ విషయంపై బీజేపీ నేతలు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. కేంద్రం ఇచ్చే అన్ని పథకాలకు పేర్లు మార్చి చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
చంద్రబాబు మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి ప్రపచం మొత్తానికి తెలుగు. మంచి అయితే తాను చేసినట్లుగా.. చెడు అయితే ప్రతిపక్షాలు చేశాయన్నట్లుగా కలరింగస్తారు చంద్రబాబు. నోట్ల రద్దు అద్భుతం - ఆ సలహా మోదీకి ఇచ్చింది తానేనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు.. మొన్నటికి మొన్న ఢిల్లీలో నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య అని ప్రకటించారు. ప్రస్థానం సినిమాలో చెప్పినట్లు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ రాజకీయాల్లో.