Begin typing your search above and press return to search.

పరేడ్ గ్రౌండ్ లో గర్జించిన బీజేపీ.. అమిత్ షా సహా సీఎంల నిప్పులు

By:  Tupaki Desk   |   17 Sept 2022 12:06 PM IST
పరేడ్ గ్రౌండ్ లో గర్జించిన బీజేపీ.. అమిత్ షా సహా సీఎంల నిప్పులు
X
విమోచన దినోత్సవం సాక్షిగా కేంద్ర హోంమంత్రి రెచ్చిపోయారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వానికి ధైర్యం లేని పని తాము చేశామని తొడగొట్టారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని.. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వమూ సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోడీ ఆదేశించారని చెప్పారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు.

జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ కృషితో నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందని అన్నారు.

దేశమంతటికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని.. నిజాం రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారని చెప్పుకొచ్చారు. ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారని అమిత్ షా కొనియాడారు.

విమోచన దినోత్సవాలకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.