Begin typing your search above and press return to search.
355 కోట్లు ఇచ్చి.. గుర్రు పెట్టి నిద్దరోతున్నారు!
By: Tupaki Desk | 16 Oct 2020 3:10 PM GMTఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 355 కోట్ల రూపాయలు. పూర్తిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఏపీకి ఇచ్చింది. అంతేకాదు.. అత్యంత కీలకమైన రెండు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది కూడా బీజేపీనే! మరి దీనికి ఏపీ బీజేపీ నేతలు ఎంత కలరింగ్ ఇచ్చుకోవాలి? ఎంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి? అభివృద్ధికి మేం కేరాఫ్.. అని చెప్పుకోవాలా? లేదా? మా సత్తా.. ఇదీ! అని ప్రచారం చేసుకోవాలా? వద్దా!! నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా.. ఇదే వ్యూహంతో ముందుకు సాగుతుంది. కానీ, బీజేపీ నేతలు.. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం గుర్రు పెట్టి నిద్దరోతున్నారట!
రాజకీయ రాజధాని విజయవాడలో శుక్రవారం రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రారంభోత్సవం అయిపోయింది. . ఈ రెండు జాతీయ రహదారిపైనే ఉండడం గమనార్హం. ఒకటి బెజవాడ కనకదుర్గ ఫ్లైవోవర్. రెండు బెంజిసర్కిల్ వద్ద నిర్మించిన ఫ్లైవోవర్. ఈ రెండు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక శంకు స్థాపన చేసుకుని.. పూర్తి అయినవే.. ప్రారంభానికి నోచుకున్నవే. కనక దుర్గ ఫ్లైవోవర్ అయితే.. అత్యంత ఆధునికంగా నిర్మించారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలి అపూర్వ వంతెనగా.. దేశంలో మూడోదిగా ఇది రికార్డు సృష్టించింది.
ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం. దీనికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు 355 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర సర్కారు 147 కోట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనిని రాజకీయంగా వాడుకుని.. ప్రజల దృష్టిని తమవైపు మళ్లించుకునేందుకు బీజేపీ నేతలు ఏమైనా ప్రయత్నించారా? అంటే.. మా నేతలు శుభ్రంగా తినిపడుకున్నారని .. అంటున్నారు కమలం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు. ఎక్కడైనా.. గుళ్లపై దాడులు జరిగితే.. చెప్పండి.. వాలిపోతాం.. మాకు ఇలాంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే తీరికలేదు! అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే.. అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలు మాత్రం ఈ పైవంతెనల ఘనత తమదంటే తమదని కొట్టేసుకుంటున్నాయి. మేం అధికారంలో ఉండగా ఈ ప్రాజెక్టులు తీసుకువచ్చామని.. చంద్రబాబు ఆయన అనుచరులు చెప్పుకొంటున్నారు. ఈ ఘనతను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ నేతలు .. ఇదే తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తమ ఘనతేనని ప్రచారం చేస్తున్నారు. మేం పూర్తి చేయించాం.. అని వారు చెప్పుకొంటున్నారు. కానీ.. బీజేపీ నేతల ఊసు.. ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. బహుశ.. 2024లో అధికారంలోకి వచ్చాక చెప్పుకొంటారేమో.. అని సటైర్లు విసురుతున్నారు విశ్లేషకులు.