Begin typing your search above and press return to search.

పార్టీల మధ్య ఘర్షణ - కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి

By:  Tupaki Desk   |   7 Dec 2018 6:21 AM GMT
పార్టీల మధ్య ఘర్షణ - కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి
X
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్లు మండలంలోని జంగారెడ్డి పల్లిలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి - తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలీంగ్ బూత్ ను పరిశీలించడానికి వచ్చిన ఆయనపై దాడి చేశారు.

కొందరు వ్యక్తులు వంశీచంద్ రెడ్డి కారుపై రాల్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. వంశీచంద్ రెడ్డికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వచ్చి అల్లరిమూకను తరిమికొట్టి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీజేపీ కార్యకర్తలే వంశీపై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ కు ఆయన్ను తరలించారు. ఈ ఘటనతో కల్వకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కాంగ్రెస్ - టీడీపీ-టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

నిజామాబాద్ లోని మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో టీఆర్ ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ లో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.