Begin typing your search above and press return to search.
తుళ్లూరులో తొడ కొట్టిన బీజేపీ.. జగన్ పై తీవ్ర మండిపాటు
By: Tupaki Desk | 5 Aug 2022 5:46 AM GMTకొద్ది కాలం క్రితం తెలంగాణలో ఒక విచిత్రమైన సీన్ ఉండేది. బీజేపీ - టీఆర్ఎస్ మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది? అన్న ప్రశ్నను బీజేపీ సీనియర్ నేతల్ని ప్రశ్నించినప్పుడు.. వారు సైతం సూటిగా సమాధానం చెప్పేవారు కాదు. ఆఫ్ ద రికార్డులో మాట్లాడే క్రమంలో.. ఈ కన్ఫ్యూజన్ ను ఎంత త్వరగా తీర్చేస్తే.. అంత త్వరగా తెలంగాణలో పార్టీ బలపడుతుందన్న మాటను పంచుకునే వారు. ఇప్పుడు పరిస్థితిని చూస్తే.. రెండు పార్టీల మధ్య నడుస్తున్న రచ్చ అందరికి తెలిసిందే. బీజేపీ నిజంగా పోరాటం షురూ చేసి.. అధికారం కోసం ఆరాటపడటం మొదలైతే సీన్లు ఎలా ఉంటాయన్నది తెలంగాణలో చూస్తున్నాం.
గతంలో తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉందో.. ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని చెప్పాలి. క్షణం తీరిక లేనంత బిజీగా ఉండే ప్రధాని మోడీ.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా అపాయింట్ మెంట్ అడిగితే.. వెంటనే ఖరారయ్యే పరిస్థితి ఉండదు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడగాలే కానీ.. ఇట్టే ఆయనకు అపాయింట్ మెంట్ దొరికేయటం తెలిసిందే.
మోడీషాలకు అంత దగ్గరగా ఉండే జగన్ మీదా.. ఆయన ప్రభుత్వం మీదా ఏపీ బీజేపీ నేతలు అప్పుడప్పుడు విరుచుకుపడటం కనిపిస్తుంటుంది. ఇలాంటివేళలోనే.. ఏపీ అధికారపక్షానికి.. బీజేపీ మధ్యనున్న రిలేషన్ ఎలాంటిదన్న సందేహం రాక మానదు.
తాజాగా తుళ్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాత్రం ఏపీ బీజేపీ నేతలు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. బీజేపీ ఆధ్వర్యంలో ‘మనం.. మన అమరావతి’ పేరుతో వారం పాటు నిర్వహించిన పాదయాత్రకు ముగింపుగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రసంగించారు. వారంతా సీఎం జగన్ మీద ఘాటు విమర్శలు చేయటం గమనార్హం.
సుజనాచౌదరి మాట్లాడుతూ.. 2019లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్న ఆయన.. రాజధాని ప్రాంతానికి ఏ పార్టీ నేతలు వచ్చినా అమర్యాదగా ప్రవర్తించొద్దన్నారు. బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ మాట్లాడుతూ.. దేశానికైనా.. రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉండాలని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన భూసమీకరణను ప్రస్తావిస్తే.. సీఎం జగన్ పులివెందులలో భూసమీకరణకు పిలుపునిస్తే.. కడప జిల్లా ప్రజలు ఒక్క ఎకరం కూడా ఇచ్చేందుకు ముందు రాలేదని గుర్తు చేశారు.
గోదావరి జిల్లాలో రెండు కులాల మధ్య కుంపటి పెట్టారని.. రాయలసీమ ప్రాంతంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ఏపీ అధికార పార్టీ నేతకు ఉత్తరాంధ్రను అప్పగిస్తే.. గంజాయి వ్యాపారం చేస్తూ.. కొండలు తవ్వుతున్నారన్నారు. ఏపీలో బీజేపీకి సీట్లు రాకున్నా.. మోడీ సర్కారు మాత్రం రాష్ట్రానికి నిధులు ఇస్తుందన్నారు. మొత్తంగా.. ఏపీ అధికారపక్షంపై రాష్ట్ర బీజేపీ నేతలు మాటలు మాత్రం గతం కంటే చురుగ్గా.. సూటిగా ఉండటం కనిపిస్తోంది. మరి.. వీరి మాటలకు వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.