Begin typing your search above and press return to search.

అబ్బే.. ప్రశాంత్ కిషోర్ కు అంత సీన్ లేదట!

By:  Tupaki Desk   |   9 Jun 2019 5:17 AM GMT
అబ్బే.. ప్రశాంత్ కిషోర్ కు అంత సీన్ లేదట!
X
ఒకవైపు పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ కు మరింత ఊపు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పీకేకు మరింత పేరు వచ్చింది. ఏపీలో జగన్ పార్టీ సాధించిన సంచలన విజయంలో పీకేకు కు వాటా దక్కింది! ఆ పార్టీకి స్ట్రాటజిస్టుగా పని చేయడంతో పీకే టీమ్ కు మరింత పేరు వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంలో పీకే వ్యూహాలు, సిద్ధాంతాలు ఎంత వరకూ వర్కవుట్ అయ్యాయో కానీ, జగన్ గెలిచారు కాబట్టి.. ప్రశాంత్ కిషోర్ రేంజ్ మరింత పెరిగింది.

అందుకు నిదర్శనమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీకేను పిలిపించుకోవడం. త్వరలోనే బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో మమతా అలర్ట్ అవుతోంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తమకు గట్టి పోటీ ఇవ్వడంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీని ఎలా ఎదుర్కొనాలో కొంచెం చెప్పమని పీకేని మమత కోరినట్టుగా తెలుస్తోంది.ఐ ప్యాక్ తో టీఎంపీ ఒప్పందం చేసుకున్నట్టే అని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద బీజేపీ స్పందించి. ప్రశాంత్ కిషోర్ మీద ఆ పార్టీ కామెంట్ చేసింది.

గతంలో మోడీ విజయంలో కీలక పాత్ర వహించాడనే పేరుంది ప్రశాంత్ కిషోర్ కు. ఈ నేపథ్యంలో కూడా పీకేను తక్కువ చేసి మాట్లాడారు బీజేపీ వాళ్లు. అప్పట్లో అమిత్ షా అసలు సూత్రధారి అని, పీకేది చాలా పరిమిత పాత్ర అని బీజేపీ అంటోంది. బీజేపీ విజయంలో, మొదటి సారి మోడీ ప్రధాని కావడంలో పీకే పాత్ర ఏమీ లేదని, అంతా అమిత్ షానే చేశారని, పీకేకు అంత సీన్ లేదని కమలనాథులు అంటున్నారు!