Begin typing your search above and press return to search.
సీఎం రమేశ్ కంప్లయింట్.. జీవీఎల్‌కు నడ్డా క్లాస్?
By: Tupaki Desk | 27 Oct 2020 5:30 PM GMTబీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి ఓ రేంజిలో చీవాట్లు పడ్డాయట. ఏపీలో పంట నష్టాలు, వ్యవసాయ రంగానికి సంబంధించి సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలాతో వైసీపీ నేతలు, ఏపీ వ్యవసాయ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి జీవీఎల్ సిద్ధమయ్యారట. వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో వీడియో కాన్ఫరెన్సు సమాచారం ఏపీకి చెందిన మిగతా బీజేపీ ఎంపీలకు ఇవ్వలేదు. ఈ సంగతి మంత్రి పురుషోత్తం రూపాలా ద్వారా తెలుసుకున్న ఎంపీ సీఎం రమేశ్ నేరుగా విషయాన్ని జేపీ నడ్డాకు చేరవేయగా ఆయన జీవీఎల్‌పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
దీంతో అప్పటికప్పుడు మిగతా ముగ్గురు బీజేపీ ఎంపీలకు సమాచారం అందించి.. వారు కాన్ఫరెన్సులోకి వచ్చేవరకు వెయిట్ చేసి సమావేశం పూర్తి చేశారట. జీవీఎల్ తీరుపై సీఎం రమేశ్‌తో పాటు మిగతా ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా జేపీ నడ్డా వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఆయన బీజేపీ ఎంపీలా కాకుండా వైసీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి పార్టీలోనివారి నుంచే వినిపిస్తోంది. తాజా ఘటనతో ఎంపీల నుంచి వచ్చిన ఫిర్యాదు తరువాత బీజేపీ అధిష్ఠానం జీవీఎల్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధిగా ఉంటూ వచ్చిన జీవీఎల్ ను కొద్ది రోజుల కిందట ఆ పదవి నుంచి తప్పించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బావ - మత బోధకుడు అయిన బ్రదర్ అనిల్ కుమార్ జీవీఎల్ కు సమీప బంధువని.. ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయని ఇటీవల ఏపీ రాజకీయాల్లో విమర్శలొచ్చాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా జీవీఎల్ మాత్రం వైసీపీకి దగ్గరగా ఉన్నారని ఆ పార్టీలోని నాయకులే అంటున్నారు.