Begin typing your search above and press return to search.
మోడీ బ్యాచ్ రివర్స్ గేర్ రాజకీయం
By: Tupaki Desk | 17 Jun 2017 4:43 AM GMTమోడీ బ్యాచ్ తీరు విపక్షాలకు మంట పుట్టేలా ఉందట. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో మోడీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందరిని కలుపుకుపోయేలా తాము ప్రయత్నిస్తున్నామన్న భావన కలిగేలా చేయటం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు మోడీ. ఇందులో భాగంగా తాజాగా విపక్ష నేతల్ని కలిసి.. రాష్ట్రపతి అభ్యర్థి విషయం గురించి మాట్లాడారు.
తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన కమలనాథులు దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు.సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా మీరు ఎవరిని అనుకుంటున్నారంటూ కేంద్రమంత్రుల బృందం అడిగిన ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్ని ఆశ్చర్యకరంగా మార్చింది.
ఎందుకంటే.. విపక్షాల్ని కలవాలని అనుకున్నది.. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది అధికారపక్షమే. ఇలాంటప్పుడు.. తాము బరిలో నిలపాలని అనుకుంటున్న అభ్యర్థి ఫలానా? అని చెప్పటం ఉంటుంది. అందుకు భిన్నంగా మీరు అనుకుంటున్న అభ్యర్థి ఎవరు? ప‌్రశ్నను సంధించారే కానీ.. తాము ఎవరిని అనుకుంటున్నామన్నది మాత్రం చెప్పలేదు.
ఇలాంటి అనుభవమే మిగిలిన విపక్ష నేతలకు ఎదురైనట్లుగా చెబుతున్నారు. విపక్షాలతో పాటు.. స్వపక్షంలోని పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ.. మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితోనూ భేటీ అయ్యారు. బీజేపీ నేతలతో జరిగిన భేటీ గురించి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ మాట్లాడుతూ.. తమ నిర్ణయాన్ని వెల్లడించటానికి వీలుగా రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లను చెబుతారని ఆశించామని..కానీ.. అందుకు భిన్నంగా..మీరు ఎవరిని అనుకుంటున్నారంటూ అడిగిన వైనం ఆశ్చర్యకరంగా అనిపించదన్నారు.
వారు పేర్లు చెప్పకుండా.. రివర్స్ లో తమనే పేర్లను అడగటాన్ని తాము ఊహించలేదన్నట్లుగా కాంగ్రెస్ తో సహా మిగిలిన విపక్షాల మాటలున్నాయి. ఆదిలోనే అపశృతి మాదిరి.. రాష్ట్రపతి అభ్యర్థిని ఏకాభిప్రాయ సాధన కోసం.. విపక్షాల పేర్లను సూచించమని అడుగుతున్న బీజేపీ నేతల తీరు ఏ మాత్రం సరిగా లేదని చెబుతున్నారు. అభ్యర్థి పేరు చెప్పకుండా మద్దతు అడిగినట్లుగా విపక్ష నేతలు చెబుతున్నారు. మొత్తానికి మోడీ బ్యాచ్ తీరు.. విపక్షాలకు ఒక పట్టాన అర్థం కాని రీతిలో మారిందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/