Begin typing your search above and press return to search.

స‌భ బీజేపీది..చ‌ర్చ కేసీఆర్ గురించి!

By:  Tupaki Desk   |   21 Jan 2017 10:45 AM GMT
స‌భ బీజేపీది..చ‌ర్చ కేసీఆర్ గురించి!
X
సాధార‌ణంగా ఏ పార్టీకి చెందిన‌ది అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలంటే పార్టీ బ‌లోపేతం- సొంత ప్ర‌ణాళిక‌లు,-భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ వంటి విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తాయి. ఒక‌వేళ ఇత‌ర‌త్రా పార్టీల గురించి చ‌ర్చ జ‌రిగినా అది స్వ‌ల్ప స‌మ‌యం మాత్ర‌మే. కానీ భద్రాచలంలో జ‌రుగుతున్న‌ తెలంగాణ బీజేపీ నేతల కార్యవర్గ సమావేశంలో మాత్రం ప్రధాన చ‌ర్చ వేరే అంశంపై జ‌రుగుతోంది. అదే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి! అదేంటి బీజేపీ మీటింగ్‌ లో మిత్ర‌ప‌క్షం కూడా కానీ టీఆర్ ఎస్ గురించి చ‌ర్చ ఎందుకు? అంటే అదే కేసీఆర్ మాయ‌.

మ‌రో 2 ఏళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధం అవ‌డం అనే ప్ర‌ధాన ఎజెండాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేత‌లు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గురించి తేల్చుకోలేక‌పోతున్నారట‌. ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ తో పొత్తుపెట్టుకోవాలా లేదా అనే వారి సందేహం. పొత్తు పెట్టుకుంటే తోక పార్టీ నేత‌లుగా మిగిలిపోతామ‌నే భ‌యం! ఒంటరిగా బ‌రిలో దిగితే విజ‌యంపై పూర్తి గ్యారంటీ లేని ప‌రిస్థితి!! పోనీ....కేసీఆర్‌ తో భ‌విష్య‌త్‌ లో పొత్తు ఉండ‌దు గాక ఉండ‌దు అని గ‌ట్టిగా చెప్పేద్దాం అనుకుంటే ఢిల్లీ పెద్ద‌లు గులాబీ ద‌ళ‌ప‌తిని త‌మ వ్యూహాత్మ‌క భాగ‌స్వామిగా అంచ‌నా వేస్తున్న ప‌రిస్థితి. పెద్ద‌నోట్ల ర‌ద్దును దేశంలో అంద‌రికంటే ముందుగా స్వాగ‌తించిన ముఖ్య‌మంత్రి, రాజ‌కీయ నాయ‌కుడు కేసీఆర్ అనేది తెలిసిందే. అదే స‌మ‌యంలో పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముందు స్వాగ‌తించి అనంత‌రం విమ‌ర్శించారు. కానీ కేసీఆర్ అలా చేయ‌లేదు. ఈ ప‌రిణామం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప‌రిపాల‌నను, టీఆర్ ఎస్‌ ను గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌లేక అలా అని స‌మ‌ర్థించ‌లేక బీజేపీ నేత‌లు స‌త‌మ‌తం అవుతున్నారు. ఇలాంటి విచిత్ర స్థితిలో చివ‌రికి ఏం తేలుస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/