Begin typing your search above and press return to search.

సోము వీర్రాజుకి సౌండ్ లేదా?

By:  Tupaki Desk   |   22 March 2021 6:30 AM GMT
సోము వీర్రాజుకి సౌండ్ లేదా?
X
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఏపీలో బీజేపీ బలం ఎంతనేది తేలిపోయింది. విశాఖ ప్రైవేటీకరణ ఎఫెక్ట్ బీజేపీపై గట్టిగానే పడింది. స్థానిక ఎన్నికల్లో కమలం పార్టీకి భారీగా దెబ్బపడింది. ఇప్పుడు జనసేన కూడా అంటీముట్టనట్టుగా తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఉండబోతుండడంతో ఆ పార్టీకి బలమైన వాయిస్ లేకుండా పోతోందన్న ఆవేదన కార్యకర్తల్లో సాగుతోందట..

స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఏపీలో 2023లో అధికారమే లక్ష్యమంటూ ప్రకటించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సౌండ్ లేకుండా పోయిందని వాళ్ల పార్టీ వాళ్లే అంటున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనేది సోము వీర్రాజుకు తెలియదని.. ఆయనకి తెలిసింది మీడియాలో హైప్ మాత్రమే అని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ తేలిపోయిందని.. ఏమాత్రం ప్రభావం చూపలేదని.. దీనికి సోము వీర్రాజు చేసిన తప్పులే కారణమని కేడర్ అంటున్నారట..

రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు జనసేన-బీజేపీ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదని.. కానీ ఆ పని వీర్రాజు చేయలేదు అని అంటున్నారు. జనసేన క్యాడర్ లేకున్నా తిరుపతి బరిలోకి దిగాలని చూశారు. అయితే జనసేనను తప్పించి బీజేపీ బరిలోకి దిగింది. జనసేనకు ఇష్టం లేకుండా బీజేపీ నిలబడడంతో జనసేన కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. వారంతా మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఓట్లు వేసేసి కసి తీర్చుకున్నారని అంటున్నారు.. కొన్ని చోట్ల టీడీపీకి వేశారని టాక్.

ఇలా జనసేన కార్యకర్తలు బీజేపీకి సరిగా పనిచేయలేదని.. బీజేపీకి సొంత బలం లేదు అని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోయిందని చెబుతున్నారు. కేవలం మీడియా పులులు మాత్రమే అని బీజేపీని దెప్పిపొడుస్తున్నారు. ప్రజలకు దగ్గరగా బూత్ స్థాయిలో బీజేపీకి బలం లేదు అని చెబుతున్నారు. బీజేపీ ఫెయిల్ అయ్యిందంటే కారణంగా ప్రజల్లోకి ఆ పార్టీ వెళ్లకపోవడమే అంటున్నారు. ఇక సోము వీర్రాజుకు ప్రజల్లో ప్రత్యక్షంగా గెలిచిన సందర్భం లేదు అని.. అందుకే ఆయనకు ఆ అనుభవం లేదంటున్నారు. సీనియర్ లీడర్ కూడా సోము వీర్రాజు కాదు అని.. క్షేత్రస్తాయిలో బలం లేని నాయకుడు అని బీజేపీ వాళ్లే ఢిల్లీలో చెప్పారంట.. ఈ నేపథ్యంలోనే రోబోయే రోజుల్లో బీజేపీ-జనసేన ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.