Begin typing your search above and press return to search.

మిత్రుల్ని ఘోరంగా హ‌ర్ట్ చేసిన బాబు

By:  Tupaki Desk   |   5 Sep 2017 6:06 AM GMT
మిత్రుల్ని ఘోరంగా హ‌ర్ట్ చేసిన బాబు
X
మంచికో చెడుకో ఒక మాట అనుకుంటే.. దానికి క‌ట్టుబ‌డి ఉండేందుకు చాలామంది ఇష్టం చూపిస్తారు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో మాత్రం ఇది అస్స‌లు క‌నిపించ‌దు. త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి ప‌ద‌వులు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న‌.. మిత్రులుగా ఉండే వారిని గౌర‌వంగా చూడ‌టం లేద‌న్న విమ‌ర్శ ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మిత్ర‌త్వం మొద‌లైనా.. న‌మ్మ‌కంతో మ‌రింత ముందుకు వెళ్లాలి. అయితే.. ఈ ధోర‌ణి బాబులో మిస్ అవుతుంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.

తాజాగా నాయ‌క‌త్వ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీలోని 175 స్థానాల్లోనూ విజ‌యం సాధించేలా ప‌ని చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. బాబు చెప్పినంత‌నే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ టీడీపీ విజ‌యం సాధిస్తుందని ఎవ‌రూ చెప్ప‌రు. నిజానికి అన్ని స్థానాల్లో ప‌క్కాగా విజ‌యం సాధించాల‌ని చెప్పిన చంద్ర‌బాబుకు కూడా నిజం ఏమిటో తెలుసు.

అయితే.. గెలుపు మీద ఆశ‌తో తాము మిత్రుల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌న్న విష‌యాన్ని బాబు మ‌ర్చిపోయారు. బీజేపీతో జ‌త క‌ట్టిన నేప‌థ్యంలో.. 175 స్థానాల్లో కొన్నింటినైనా ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. క‌నీసం 2014 ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించారో.. వాటినైనా క‌నీసం కేటాయించాల్సిందే. అదే జ‌రిగితే బాబు మాట‌లో అర్థం లేద‌ని చెప్పాలి. అలాంట‌ప్పుడు ఏ ఆలోచ‌న‌తో అన్నీ స్థానాల్లోనూ టీడీపీ గెల‌వాల‌న్న మాట బాబు నోటి నుంచి వ‌చ్చింద‌న్న‌ది అర్థం కానిది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము మిత్రుల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌న్న క‌నీస ఆలోచ‌న‌ను కూడా బాబు మ‌ర్చిపోయిన‌ట్లుగా కనిపిస్తుంద‌ని చెప్పాలి. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తే తీసుకుంటే.. ఆయ‌న ఎప్పుడు మాట్లాడినా ఉన్న స్థానాల్లో మిత్రడైన మ‌జ్లిస్ స్థానాల్ని వ‌దిలేసి మ‌రీ లెక్క చెబుతుంటారు. అధికారికంగా మ‌జ్లిస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేన‌ప్ప‌టికీ ఆ పార్టీకి ఇవ్వాల్సిన గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం క‌నిపిస్తుంది. ఇలాంటివేమీ బాబులో క‌నిపించ‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి మాట్లాడిన చంద్ర‌బాబు.. అన్ని స్థానాల్లో త‌మ పార్టీనే గెల‌వాల‌న్న ల‌క్ష్యం గురించి మాట్లాడిన తీరు ఏపీ క‌మ‌ల‌నాథుల్ని హ‌ర్ట్ చేసింద‌ని చెప్పాలి. కూర‌లో క‌రివేపాకు మాదిరి ప‌క్క‌న ప‌డేసిన బాబు తీరుపై వారు ఉడికిపోతున్నారు. పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచేలా ప్ర‌య‌త్నం చేయాల‌ని చెప్పినా బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా మిత్రుల ఊసు ఎత్త‌ని బాబు తీరు ఆయ‌న మిత్రుల‌కు మండిపోయేలా చేస్తోంది.