Begin typing your search above and press return to search.

యూపీ సీఎం రేసులో ఉన్నోళ్ల బలాలు..బలహీనతలు

By:  Tupaki Desk   |   12 March 2017 4:43 AM GMT
యూపీ సీఎం రేసులో ఉన్నోళ్ల బలాలు..బలహీనతలు
X
మోడీ టార్గెట్ చేసినట్లే యూపీ కోట ఆయన సొంతమైంది. యూపీలో సాధించిన సంచలన విజయం ఆయన్ను తిరుగులేని నేతగా మార్చేసింది. తాజాగా వచ్చిన బలంతో ప్రధాని మరింతగా చెలరేగిపోవటం ఖాయం.సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మోడీ ఇక ఏ మాత్రం సంశయించరని చెప్పటంలో సందేహం లేదు. అంతా బాగానే ఉంది. మరి.. యూపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. మోడీ మనసులో ఉన్నదెవరన్న దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కాకుంటే.. నాలుగు పేర్లు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులుగా బలంగా వినిపిస్తున్నాయి.

ఆ పేర్లను చూస్తే.. మొదటిపేరు కేంద్రహోం మంత్రి రాజ్ నాథ్ సింగ్. మోడీకి విధేయుడిగా.. నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ..కేంద్రంలో కీలకభూమిక పోషిస్తుండటం.. యూపీ ముఖ్యమంత్రిగా చేస్తే.. బీజేపీలో ఆయనో అధికారక్షేత్రంగా మారే అవకాశాల నేపథ్యంలో..రాజ్ నాథ్ కు సీఎం పదవిని ఇచ్చే విషయం గురించి మోడీ పాజిటివ్ గా ఆలోచిస్తారా?అన్నది సందేహమే.అయితే.. సీనియార్టీకి పెద్దపీట వేసి..బలమైన నేత నేతృత్వంలో యూపీ ఉండాలని మోడీ ఫీల్ అయితే.. ఆయనకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. కానీ.. ఎంతో కష్టపడి గెలిచిన యూపీలో తన మార్క్ స్పష్టంగా కనిపించాలని మోడీ తహతహలాడటం ఖాయం. రాజ్ నాథ్ లాంటి సీనియర్ నేతకు సీఎం పగ్గాలు అప్పచెబితే.. తరచూ జోక్యం చేసుకోవటానికి సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి లెక్కల నేపథ్యంలో రాజ్ నాథ్ కు మోడీ అవకాశం ఇస్తారా?అంటే సందేహమేనని చెప్పక తప్పదు. రాజ్ నాథ్ తో పాటు..సీఎం రేసులో ఉన్నట్లుగా చెబుతున్న పేర్లను పరిశీలిస్తే..ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ యోగీ అదిత్యనాథ్.. ఎంపీ మనోజ్ సిన్హా..యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యలను చెప్పొచ్చు. ఒకవేళ వీరంతా కాదు..చురుకైన యువకుడు.. సమర్థుడు అని ఎవరినైనా మోడీ ఫీల్ అయితే.. వారికి కూడా సీఎం పదవి దక్కే అవకాశం ఉందన్నమాట బలంగా వినిపిస్తుంది.

రేసులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న నేతల ప్లస్సులు.. మైనస్సులు చూస్తే..

రాజ్ నాథ్ సింగ్..

= సీనియర్ నేత. సంఘ్ తో సన్నిహిత సంబంధాలున్న నేత.

= 24 ఏళ్ల వయసులో జన్ సంఘ్ జిల్లా అధినేతగా పొలిటికల్ కెరీర్ షురూ చేసి..నేడు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు పోషిస్తున్నారు.

= రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం.

= బీజేపీకి అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

= అందరినీ కలుపుకుపోగలరన్న పేరుంది.

= రాజ్ నాథ్ ను సీఎంను చేస్తే.. బీజేపీలో మరో పవర్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లేనన్న విమర్శ ఉంది.

= తనకు సమానంగా ఎదిగే అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడని మోడీ మైండ్ సెట్ రాజ్ నాథ్ కు ఛాన్స్ రాకుండా చేసే అవకాశం.

యోగీ ఆదిత్యనాథ్..

= కరుడు కట్టిన హిందుత్వవాది. సంఘ్ భావజాలాన్ని పూర్తిగా వంట బట్టించుకున్ననేత.

= ఫైర్ బ్రాండ్ తత్త్వం. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.

= ప్రత్యర్థులపై విరుచుకుపడటం.

= సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలంటూ మోడనే నేరుగా అడిగేశారు.

= ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మతాన్ని నిండుగా వంటబట్టించుకోవటమే పెద్ద బలహీనత.

= హిందూయువ వాహినిలాంటి వివాదాస్పద సంస్థలకు అధ్యక్షుడిగా ఉండటం మరో మైనస్.

కేశవ్ ప్రసాద్ మౌర్య

= యూపీ బీజేపీ అధ్యక్షుడిగా తన సమర్థతను తాజా ఎన్నికల్లో ప్రదర్శించిన వైనం

= బలమైన ఓబీసీ వర్గానికి చెందిన నేత కావటం

= 1990లలో జరిగిన రామమందిరం ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న బ్యాక్ గ్రౌండ్.

= 2014లో ఎంపీగా ఎన్నికై తన బలాన్నిచాటి చెప్పటమే కాదు.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధినేతగా పని తీరు ఫ్లస్సే అవుతుంది.

= అనుభవం లేకున్నా..సమర్థతకే ప్రాధాన్యత ఇస్తూ మోడీ నిర్ణయం తీసుకుంటే సీఎంగా ఛాన్స్

= పాలనకు సంబంధించిన అనుభవలేమే పెద్ద మైనస్ పాయింట్.

మనోజ్ సిన్హా

= పార్టీ సీనియర్ నేత.

= సంఘ్ తో సన్నిహిత సంబంధాలు.

= విద్యా వంతుడు. కేంద్ర టెలికాం శాఖా మంత్రిగా సమర్థంగా పని చేయటం.

= బనారస్ హిందూ వర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేసిన విద్యావంతుడిగా పేరు ప్రఖ్యాతులు

= మోడీకి సన్నిహితుడు

= మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కీలకమార్పులు తీసుకురావటంలో కీలకభూమిక

= భూమిహార్ వర్గానికి చెందిన నేత కావటం మరో ప్లస్.

= యువతకు అవకాశం ఇవ్వాలని మోడీ డిసైడ్ అయితే.. ఛాన్స్ మిస్ అయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/