Begin typing your search above and press return to search.
రజనీకాంత్ ధీమా వెనుక అసలు కారణమిదేనట!
By: Tupaki Desk | 6 Feb 2020 2:47 PM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగు....తూనే ఉన్న సంగతి తెలిసిందే. తలైవా గుంపుగా కాకుండా సింహం మాదిరి సింగిల్ గానే వస్తాడని ఆయన ఫ్యాన్ప్ అంటుంటే....`కాలా` కనిపించని కాషాయ కండువా కప్పుకున్నారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఏఏపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపుతున్నాయి. సీఏఏను తాను సమర్థిస్తున్నానని చెప్పిన రజనీ - సీఏఏతో ముస్లింలు - ముస్లిమేతరులలో ఏ ఒక్కరికి నష్టం కలిగినా వారికి అండగా తాను పోరాడతానని ప్రకటించారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం జరిగిన పక్షంలో వారి తరఫున తాను ఆందోళనకు దిగుతానని తలైవా సంచలన ప్రకటన చేశారు. సీఏఏపై తప్పుడు సమాచారంతో ప్రజలను తమిళ నేతలు రెచ్చగొడుతున్నారని రజనీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తలైవాపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
రజనీకాంత్ బీజేపీకి అనుకూలమని, తాజాగా రజనీ చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతలున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం - ఆయన తనయుడు కార్తీ చిదంబరం - డిఎంకే నేతలు స్టాలిన్ - అళగిరి విమర్శలు గుప్పిస్తున్నారు. సీఏఏ గురించి రజనీకాంత్ కు అవగాహన లేదని, తాను వివరిస్తానని అళగిరి ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల చేతుల్లో రజనీ కీలుబొమ్మ అని - ఆర్టికల్ 14 ఉల్లంఘన గురించి తాను రజనీకు వివరిస్తానని చిదంబరం కామెంట్స్ చేశారు. రజనీకాంత్ బీజేపీలో చేరితే తమకు అభ్యంతరం లేదని, రాజకీయాల్లోకి వచ్చేందుకు రజనీ నటించనవసరం లేదని కార్తీ చిదంబరం సెటైర్ వేశారు. ఏది ఏమైనా....మొదటి నుంచి రజనీకాంత్ కు కాషాయ ముద్ర వేయాలనుకుంటోన్న విపక్షాలకు తలైవా తాజా వ్యాఖ్యలు ఓ అస్త్రంలా మారాయి. రజనీకాంత్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారంతో కాలా కమలనాథులకు అనుకూలమే అన్న ప్రచారం చేయడలో విపక్షాలు కొంతవరకు సక్సెస్ అయ్యాయనే చెప్పవచ్చు.