Begin typing your search above and press return to search.
తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా..గవర్నర్ కు ఫిర్యాదు
By: Tupaki Desk | 22 Jan 2019 9:36 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అవకతవకలపై భారతీయ జనతాపార్టీ గళం విప్పుతోంది. పవిత్ర టీటీడీలో టికెట్ల అమ్మకాలలో అక్రమాలకు పాల్పడటం.. బ్లాక్ మార్కెట్ లో టికెట్ల అమ్మడం వంటి ఘటనలు యథేచ్చగా సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ గవర్నర్ నరసింహన్ కు బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలు లక్ష్మణ్ - దత్తాత్రేయ - కిషన్ రెడ్డి - మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పవిత్ర టీటీడీలో టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటూ కోట్లు దండుకుంటున్నారని , దీనిపై విజిలెన్స్ - ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరినట్లు నేతలు తెలిపారు. జేఈవోకు అధికారం ఇచ్చి తన గుప్పెట్లో ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని వివరించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ టీటీడీలో అవినీతి అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్నారు. `రాజకీయ ప్రమేయంతోనే కోనసాగుతున్నాయి. గతనెల టికెట్ల కుంభకోణం జరిగిన అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు భాద్యులను అరెస్ట్ చేయడం లేదు. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. విజిలెన్స్ ఆండ్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తుకు ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. అక్కడి ముఖ్యమంత్రి కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి`` అని అన్నారు. ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ ``అనేక రాష్ట్రాల నుండి తిరుమలకు భక్తులు వస్తారు. వారి దర్శనం దొరకడం లేదు. అదే సమయంలో దళారులు టిక్కెట్లు బ్లాక్ లో అమ్ముతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈవోకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలి. టీటీడీలోని అక్రమాలపై చర్యలు తీసుకోవాలి`` అని అన్నారు.
మాజీ డీజీపీ దినేష్ రెడ్డి మాట్లాడుతూ `` పెద్ద ఎత్తున భక్తుల రాకతో అత్యంత వైభవంగా నిలిచే దేవస్థానం తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు భక్తులందరికీ ఆవేదనను కలిగిస్తున్నాయన్నారు. గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలపై తాను డీజీపీ గా ఉన్నప్పుడు కొందరిని అరెస్ట్ చేశామన్నారు. ఇప్పుడు జరిగిన దానిపై విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరామన్నారు. దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వివరించారు.