Begin typing your search above and press return to search.
అయ్యో.. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ఇలా దెబ్బయిపోయారేంటి?
By: Tupaki Desk | 30 May 2022 7:30 AM GMTఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన బీజేపీ నేతలను ఆ పార్టీ అధిష్టానం రాజ్యసభకు పంపడానికి నిర్ణయించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఏదైనా రాష్ట్రం నుంచి ఒకరిని రాజ్యసభకు పంపడానికి కనీసం 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే బీజేపీకి అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో 44 మంది ఎమ్మెల్యేలు లేరు. దీంతో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య బీజేపీ నేతలను రాజ్యసభకు ఎంపిక చేయనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆశావహులు ఆశల పల్లకీలో ఊగిపోయారు. అయితే వీళ్లందరి ఆశల మీద బీజేపీ అధిష్టానం నీళ్లు చిమ్మింది. ఒక్కరంటే ఒక్కరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ఇప్పుడు ఉసూరుమంటున్నారు.
వాస్తవానికి తెలంగాణ బీజేపీ నుంచి పెద్దల సభకు పంపే దిశగా అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో పార్టీ విస్తరణే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, రాజ్యసభలో ఒకరికి ప్రాతినిధ్యం కల్పించి రాష్ట్రానికి తామిస్తున్న ప్రాధాన్యతను చాటే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకున్నారు.
గతంలో ఆ పార్టీ నుంచి రాజ్యసభలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ బీజేపీ నేతలకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది. తమిళనాడు బీజేపీ నేత ఎల్.మురుగన్‌ను మధ్యప్రదేశ్ నుంచి, కేరళకు చెందిన మురళీధర్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపడంతో పాటు వీరిద్దరిని కేంద్రమంత్రులను చేసింది. కేరళ నుంచి సినీనటుడు సురేశ్ గోపిని రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసి రాజ్యసభకు పంపింది.
ఇదే తరహాలో తెలంగాణ నేత ఒకరిని ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలు చేస్తోందని వార్తలు వచ్చాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకున్నారు. వీరితో పాటే మరో ఒకట్రెండు పేర్లు పరిశీలనలో ఉన్నా సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను అంచనా వేసుకొనే అభ్యర్థిని నిర్ణయించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీరందరికీ బీజేపీ అధిష్టానం జెల్లకొట్టింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రామ్ మాధవ్ తదితరులకు కూడా రాజ్యసభ సీటు ఖాయమని అని చెప్పుకున్నారు. అయితే వీరికి కూడా అవకాశం దక్కలేదు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఏపీలో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌పై బీజేపీ నేతలు చేస్తున్న పోరాటానికి.. బీజేపీ అధిష్టానం గుర్తింపు ఇస్తుందనుకుంటే.. అదేమీ లేకుండా మొండి చేయి చూపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేయకుండా తాజాగా వేరే రాష్ట్రాలకు రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఇందులో భాగంగా 8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అవకాశం దక్కింది.
తాజాగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థులు వీరే:
– లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శణ సింగ్, సింగీతా యాదవ్(ఉత్తరప్రదేశ్)
– కృష్ణలాల్ ( హర్యానా)
– నిర్మలా సీతారామన్, జగ్గేశ్ ( కర్ణాటక )
– పీయూష్ గోయల్, అనిల్ సుఖ్‌దేవ్ రావ్ బొండే (మహారాష్ట్ర )
– సతీష్ చంద్ర, శంభు శరణ్ (బీహార్)
– సుశ్రి కవితా పటిదార్ (మధ్యప్రదేశ్ )
- కల్పనా సైనా (ఉత్తరాఖండ్)
– గణశ్యామ్ తివారీ (రాజస్థాన్ )