Begin typing your search above and press return to search.
గల్లా... విజిటింగ్ ప్రోఫెసరా?
By: Tupaki Desk | 14 Feb 2018 12:03 PM GMTగల్లా జయదేవ్... టీడీపీ యువనేతగా - గుంటూరు ఎంపీగా మనకు తెలుసు. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్.. మొన్నటి ఎన్నికల్లో తన సొంత జిల్లాను వదిలేసి గుంటూరుకు వలస వచ్చేశారు. తనకు పిల్లనిచ్చిన మామ సూపర్ స్టార్ కృష్ణ - బావమరిది ప్రిన్స్ మహేశ్ బాబులకు అడ్డాగా ఉన్న గుంటూరులో వారి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే ఈజీగా గెలిచేస్తానన్న నమ్మకంతో గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగా మాజీ మంత్రి అయిన తన తల్లి గల్లా అరుణకుమారితో కలిసి గల్లా జయదేవ్ టీడీపీలో చేరిపోయారు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గల్లా ఫ్యామిలీ... ఆది నుంచి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో వైరాన్నే కొనసాగించింది. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీయక తప్పదన్న భావనతో చాలా మంది సీనియర్ రాజకీయవేత్తలతో పాటు గల్లా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ కు చేయిచ్చి... టీడీపీలో చేరిపోయాయి. పార్టీలో చేరిన వెంటనే చంద్రగిరిని గల్లా అరుణకు - గుంటూరు లోక్ సభ స్థానాన్ని గల్లా జయదేవ్ కు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా సరేనన్నారు.
ఎన్నికల్లో గల్లా అరుణను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి చిత్తు చిత్తుగా ఓడించగా... సూపర్ స్టార్ ఫ్యాన్స్ పుణ్యమా అని గల్లా జయదేవ్ గెలిచేశారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత గల్లా జయదేవ్ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్న వాదన గుంటూరు వాసుల్లో వినిపించింది. అయినా ఓ పారిశ్రామికవేత్తగా ఉన్న జయదేవ్ నుంచి తాము ఆశించి ఏం లాభం? అన్న మాట కూడా వినిపించింది. ఈ క్రమంలో మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాసుకొచ్చిన ప్రతిని చదివేసి... తనకున్న గట్టి వాయిస్‌తో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గల్లా జయదేవ్ మిగిలిన వారి కంటే కాస్త మెరుగ్గానే రాణించారన్న వాదన వినిపించింది. ఈ మాత్రానికే తెలుగు తమ్ముళ్లు గల్లాను భుజాల మీదకు ఎత్తుకుని మరీ ఘనంగా సన్మానం చేయించుకున్నారు. ఈ తరహా సన్మానంపై రాష్ట్రవ్యాప్తంగా విస్మయం వ్యక్తం కాగా.. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగిపోయారు. బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరగని వైనంపై ఇప్పటికే టీడీపీ - బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్ - యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్... గల్లా జయదేవ్ పై సెటైరిక్ కామెంట్లు సంధించారు. అసలు గల్లా జయదేవ్ ఏం సాధించారని సన్మానం చేస్తున్నారో అర్థం కావడం లేదని వారు వ్యాఖ్యానించారు. గుంటూరులో గల్లా జయదేవ్‌ను విజిటింగ్ ఫ్రొఫెసర్ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. అవకాశమెస్తే జయదేవ్ కన్నా తాము ఇంకా బాగా మాట్లాడగలమన్నారు. ఇక ఏపీకి న్యాయం చేయని బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన వారు... టీడీపీ తమతో దోస్తీని వద్దనుకుంటే... తమకూ అవసరం లేదని తెగేసి చెప్పారు. *మాతో రాంరాం అనుకుంటే రాంరామే. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే మేమూ చేస్తాం. అందుకు కావాల్సిన ఆయుధాలు కూడా మా దగ్గర ఉన్నాయి. టీడీపీ నేతలు తమ భాషను మృదువుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది’ అని వారు సంచలన వ్యాఖ్యలు చేశారు.