Begin typing your search above and press return to search.
ఏపీలో జగన్ కు చెక్ చెప్పేందుకు బీజేపీ ప్లానింగ్ ఇదేనా?
By: Tupaki Desk | 27 July 2019 10:30 AM GMTథ్రిల్లర్ సినిమాలను తలపించేలా వ్యవహరిస్తున్నారు కమలనాథులు. దేశం మొత్తమ్మీదా కాషాయజెండా ఎగరాలనే తపనతో పలు రాష్ట్రాలను టార్గెట్ చేసి.. ఎవరికి తగ్గ ప్లానింగ్ వారికి సిద్ధం చేసిన మోడీషాలు.. తమ ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నట్లుగా చెప్పాలి. ఎంత ట్రై చేసినా దక్షిణాదిన పాగా వేయలేకపోతున్న బీజేపీ.. ఇప్పుడిప్పుడే తాను ఎంటర్ అయ్యేందుకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని సిద్ధం చేసుకుందని చెప్పాలి.
తొలిదశలో ఆపరేషన్ కర్ణాటకను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన కమలనాథులు.. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవటం ద్వారా.. అధికార టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాంగా మారారు. ఇక.. ఏపీ విషయానికి వచ్చేసరికి వారో ప్లాన్ ను సిద్ధం చేశారని చెప్పాలి.థ్రిల్లర్ సినిమాల్లో ఎలా అయితే.. ప్రేక్షకుల దృష్టి మొత్తం ఒకరిపైన ఉంచి.. చివర్లో ట్విస్ట్ ఇచ్చి అసలు విలన్ ను తెర మీదకు తీసుకొస్తారో.. ఇప్పుడదే సూత్రాన్ని ఏపీ విషయంలోనూ అమలు చేస్తున్నారని చెప్పాలి.
బాబును కంట్రోల్ చేయటంలో భాగంగా జగన్ కు తెర వెనుక ప్రోత్సాహాన్ని అందించినట్లు కనిపించినా.. అంతిమ లక్ష్యం ఏపీలో కాషాయ జెండా ఎగరటంగా చెప్పాలి. బాబును ఓటమి బాట పట్టించటం ద్వారా.. ఆయన పార్టీ నామరూపాల్లేకుండా చేయటం.. తద్వారా జగన్ కు ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీకి టీడీపీకి పడటం లేదన్న కలర్ ఇచ్చి.. జగన్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన్ను దెబ్బ తీసే ప్లాన్ ను తెర మీదకు తెచ్చిన తీరు చూస్తే.. కమలనాథుల వ్యూహచతురతను అభినందించాల్సిందే.
మొన్నటివరకూ టీడీపీని కార్నర్ చేసినట్లుగా కనిపించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా నిధులను బ్లాక్ చేయటంతో పాటు.. అభివృద్ధి పథకాల అమలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సానుకూలత లేకుండా చేస్తున్న వైనం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్ ను వెనక్కి తగ్గేలా చేయటంలో కేంద్రం కీలకభూమిక పోషించిన వైనం బయటకు రావటం తెలిసిందే. తనకే మాత్రం ఇష్టం లేని ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించటంపైనా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ వ్యూహంలో భాగంగా బాబును ప్రతిపక్ష పాత్రలో ఉండేలా చేసిన కమలనాథులు.. ఈ మధ్యనే టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు.
టీడీపీకి చెందిన పలువురు నేతల్ని బీజేపీలోకి తేవటం ద్వారా ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్నది ప్లాన్ గా చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా తనకు పెరిగి బలంతో ఎదగాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.తొలుత బాబుకు చెక్ పెట్టటంలో విజయం సాధించిన బీజేపీ నేతలు ఇప్పుడు జగన్ మీద దృష్టి పెట్టారు.
ఆయన పాలనపై ఇప్పుడే విమర్శల్ని సంధించటం ద్వారా జగన్ పాలనలో ఏదో జరిగిపోతుందన్న భావన కలిగేలా మైండ్ గేమ్ ను మొదలెట్టారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ గెలవటం వల్ల ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని రాంమాధవ్ లాంటి నేత వ్యాఖ్యానించటం ఒక ఎత్తు అయితే.. జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శల్ని చూస్తే.. జగన్ పై అదే పనిగా డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేయాలన్నది బీజేపీ ప్లాన్ గా భావిస్తున్నారు. ఓవైపు కేంద్రం నుంచి సాయాన్ని బంద్ చేసి.. మరోవైపు ఏపీ సర్కారుపై విమర్శల్ని సంధించటం ద్వారా.. ప్రజల్లో బీజేపీపై చూపు పడేలా చేయటంతో పాటు.. బలమైన నాయకులు తమ పార్టీలో చేరేలా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. ఏపీలో తమ అసలు టార్గెట్.. కాషాయ జెండా ఎగురవేయటంగా చెప్పకతప్పదు. అందు కోసం వారు వేస్తున్న ఎత్తులు అన్ని ఇన్ని కావని చెప్పక తప్పదు.