Begin typing your search above and press return to search.
అమిత్ షా పర్యటన: కేసీఆర్ - అసదుద్దీన్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్లాన్
By: Tupaki Desk | 23 Feb 2020 6:39 AM GMTపౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీ - ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రం దృష్టిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డారు. మొదటి నుంచి ఈ విధానాలపై కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా తమ పార్టీ ఎంపీలతో వ్యతిరేకంగా ఓటు వేయించారు. అయితే ఎన్నికల సందర్భంగా నిశ్శబ్ధంగా ఉన్న కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత వాటిపై స్పందించారు. తొలిసారిగా వాటిని వ్యతిరేకిస్తున్నట్లు.. రాష్ట్రంలో వాటిని అమలు చేయమని బాహాటంగా ప్రకటించారు.
అయితే ఇటీవల అదే నిర్ణయానికి కట్టుబడి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని పౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీ - ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దానికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో పాటు త్వరలోనే దీన్ని వ్యతిరేకిస్తున్న నాయకులందరితో కలిసి హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. దీంతో బీజేపీ టీఆర్ ఎస్ అధినేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ కు తోడుగా ఏఐఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉన్నాడు. ఆయన వరుసగా కార్యక్రమాలు చేపడుతూ పౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీ - ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. వీరిద్దరూ తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీ - ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమిస్తున్నారు.
దీంతో కేసీఆర్ - అసదుద్దీన్ వైఖరిని ఖండిస్తూ వారి పద్ధతి సరికాదని బీజేపీ హితవు పలికింది. అయితే కేసీఆర్ కు దీటుగా తెలంగాణ బీజేపీ నాయకులు తిప్పి కొట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రంగంలోకి దింపుదామని నిర్ణయించారు. ఈ మేరకు మార్చి 15వ తేదీన అమిత్ షాను తెలంగాణలోకి ఆహ్వానించి పౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీ - ఎన్పీఆర్ కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు అమిత్ షా కూడా ఒకే అన్నట్లు సమాచారం. అందుకే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అమిత్ షా షెడ్యూల్ ను ప్రకటించారు.
అమిత్ షా పర్యటనతో కేసీఆర్ తీరును ఎండగట్టాలని - పౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీ - ఎన్పీఆర్ మద్దతుగా అవగాహన కల్పించాలని బీజేపీ భావిస్తోంది. అమిత్ షా పర్యటనతో కేసీఆర్ తో పాటు ఏఐఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కు చెక్ పెట్టాలని ఆశిస్తున్నారు. అమిత్ షా పర్యటనతో పార్టీ శ్రేణులకు కూడా జోష్ వస్తుందని - 2024లో పార్టీ అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రచించాలనే ఆలోచనలో ఉన్నారు. అమిత్ షా పర్యటనలోపు పార్టీకి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించే అవకాశం ఉంది. ఏది ఏమున్నా కేసీఆర్ - అసదుద్దీన్ ఓవైసీని అమిత్ షా పర్యటనతో వారి వాదనను తిప్పికొట్టాలని బీజేపీ రచిస్తున్న వ్యూహాం ఫలిస్తుందా.. లేదా యథావిధిగా పార్టీకి గతంలాంటి ఫలితం వస్తుందా అనేది త్వరలో తెలియనుంది.